టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. తాజాగా స్పందించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై విరుచుకుపడిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు.. తన పేరును ప్రస్తావించ డం.. ఘోరమైన వ్యాఖ్యలు చేయడంపై తాజాగా ఆమె ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న భువనేశ్వరి.. అదే సంస్థ లెటర్ హెడ్‌పై ప్రజలను ఉద్దేశించి లేఖ రాయడం.. సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ రోజు(శుక్రవారం) ఈ ఘటన జరిగి వారం అయింది. ఈ వారం రోజుల్లోనూ భువనేశ్వరి మౌనంగానే ఉన్నారు.
కానీ, తాజాగా ఆమె లేఖరాయడం.. ఈ లేఖలో.. తనకు జరిగిన అవమానం.. తనను ఉద్దేశించి చేసిన ఘోరమైన వ్యాఖ్యలు.. మరెవ్వరికీ ఎదురు కాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన తల్లిదండ్రులు.. బసవతారకం, ఎన్టీఆర్‌లు.. ఎన్నో ఉన్నతమైన విలువలతో పెంచారని.. ఎన్నడూ తాము రాజకీయాల్లోకి రాలేదని.. కానీ.. తనను నిండు సభలో అగౌరవపరచడం అత్యంత హేయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భువ నేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు జరిగిన అవమానాన్ని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ తోబుట్టువువు, తమ తల్లికి.. జరిగిన అవమానంగా భావించి.. స్పందించడం.. తనను ఊరటపరిచిందని పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచిన క్షణాలను తాను ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. అయితే.. ప్రస్తుతం వరదలు.. వర్షాల కారణంగా.. అనేక మంది ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారికి వెంటనే సాయం చేయాలని.. ఆమె ప్రతి ఒక్కరికీ సూచించారు. తనకు జరిగిన అవమానం.. మాటలు.. వంటివి భవిష్యత్తులో ఏ మహిళకు ఎదురు కాకూడదని.. భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates