రాజకీయాల్లో నేతలు తాము ఏం చేసినా చెల్లుతుందనే కాలం చెల్లింది. నాయకుల ప్రతి అడుగును ప్రజలు గమనిస్తున్నారు. ఒకప్పుడు.. ఇంత విస్తృత మీడియా.. సోషల్ సమాచారం లేనిరోజుల్లో.. నాయకులు ఏం చేసినా.. ప్రజలకు తెలిసే సరికి సమయం పట్టేది. అయినా.. అప్పటి నాయకులు హద్దుల్లో ఉండేవారు. ప్రజాసేవ, దేశ సేవలో పొరుగు నేతలతో పోటీ పడేవారు. సరే! ఇప్పుడు మారిన ట్రెండ్‌లో సంపాదనలోను. అధికారంలోనూ ముందుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో ఇప్పుడు నాయకులు ఏం చేస్తున్నా.. ఏం మాట్లాడినా.. ప్రజలకు క్షణాల్లోనే తెలిసిపోతోంది.
అదేసమయంలో గతంలోవారు అదే సబ్జెక్ట్‌పై ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చు కుంటున్నారు. ఇలా.. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నెటిజన్లు భారీ ఎత్తున కామెంట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను తిట్టిపోశారు. టీడీపీ పార్టీ నాశనం అయిపోయిందని.. వృద్ధ జంబూకాలకు అది నిలయంగా మారిందని నోరు పారేసుకున్నారు. వాస్తవానికి.. వంశీ ఇప్పుడు ఎమ్మెల్యేగా టెక్నికల్‌గా ఉన్న పార్టీ టీడీపీనే. కానీ, రాజకీయంగా ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. కేవలం రెండేళ్ల కిందటలోనే.. వైసీపీకి మద్దతు దారుగా మారారు. అయితే.. ఈ స్వల్ప కాలంలోనే ఆయన వైసీపీని ఆకాశానికి ఎత్తేయడం.. తనకు గత ఎన్నికల్లోనూ టికెట్ ఇచ్చి.. గెలిపించిన టీడీపీని తిట్టిపోయడం.. ప్రారంభించారు. ఈ క్రమంలోనే వంశీపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబు అనుభవం అంత వయసు కూడా లేని వంశీ.. ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ సక్తిగా.. గతంలో వంశీ వైసీపీని, ఆ పార్టీ అధినేతజగన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఆ పాత వీడియోలో వంశీ ఏమన్నారంటే..”జగన్ పారిశ్రామికవేత్తే అనుకుందాం. ఆయన అనేక పరిశ్ర మలు, కంపెనీలు పెట్టి సక్సెస్ అయ్యారు. అయితే.. 2009 తర్వాత .. ఆయన ఎందుకు ఒక్క కొత్త కంపెనీ కూడా పెట్టలేదు! దీనికి కారణం.. ప్రభుత్వం నుంచి లంచాలు రాకపోవడమే. ప్రభుత్వ లంచాలతోనే జగన్ ఇప్పటి వరకు కంపెనీలు ప్రారంభించాడు. లంచాలు రాకపోవడంతో కంపెనీలు ఆపేశాడు. వైసీపీలోకి అన్నం తినేవారు ఎవరూ వెళ్లరు. అక్కడ ఉన్నవాళ్లు కూడా అంతే. మరి ఏం తింటారో.. వాళ్లే చెప్పాలి. మేం టీడీపీలో ఉన్న వాళ్లం అంతా .. అన్నమే తింటా!!” అని నొక్కి వక్కాణించారు. మరి ఇప్పుడు ఇదే వైసీపీని భుజాన వేసుకుంటున్నారు. దీంతో వంశీ సార్.. మీరు ఏం తింటున్నారు? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.