రంగులపై ఏపీకి సుప్రీంకోర్టు వార్నింగ్, డెడ్ లైన్

YSRCP

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగుల కల ఎక్కడికి పోయినా నెరవేరడం లేదు. తాజాగా చివరాఖరికి ఈ కేసులో సుప్రీం కోర్టు ఏపీ సర్కారుకు గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా 4 వారాల్లోపు ఎట్టి పరిస్తితుల్లో పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఒకవేళ డెడ్ లైన్ లోపు ఈ పనిచేకపోతే ఏపీ సర్కారు మీద కోర్టు ధిక్కరణ కేసుల పెడతామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నినెలల్లోనే దానికి దీనికి అనే తేడా లేకుండా కనిపించిన ప్రతిదానికి రంగులు వేశారు. అయితే పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.

ప్రజల డబ్బుతో, ప్రభుత్వ భవనానికి మీ పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై ఏపీ హై కోర్టు పంచాయతీ ఆఫీసులకు వేసిన రంగులు తొలగించాలి అంటూ అప్పట్లో తీర్పు ఇవ్వగా ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిని హైకోర్టులోనే తేల్చుకోమంటూ సుప్రీంకోర్టు తిప్పి పంపింది.

చివరకు రకరకాల వాదనల అనంతరం హైకోర్టు 3 వారాల గడువులోగా రంగులు తొలగించి, తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలని ఆదేశించింది. అయితే, ఇక్కడ ఏపీ సర్కారు తన తెలివిని ప్రదర్శించింది. పాత మూడు రంగుల స్థానంలో టెర్రకోట రంగుపై విలేజ్ ఆర్ట్ ను జోడించి వైసీపీ రంగులను వేయడం మొదలుపెట్టింది. పిటిషనర్లు దీనిని కోర్టు దృష్టికి తీసుకురాగా 4 రంగుల జీవో 623ను కొట్టేయడంతో పాటు ఏపీ సర్కారుపై కోర్టు దిక్కరణ కేసు రాసింది.

దీంతో మళ్లీ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ దీనిని విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవి మా జెండా రంగులు కాదని చేసిన వాదనను సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. తన స్థాయిలో కూడా ఏపీ జీవో 623ని రద్దు చేసింది. ప్రభుత్వానికి రంగులు మర్చడానికి 4 వారాల పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అంతలోపు రంగులు మార్చాల్సిందే అని చెప్పింది. ఒకవేళ డెడ్ లైన్ దాటితే కోర్టు ధిక్కార నేరం కేసు పెడతాం అని ఏపీ సర్కారును సుప్రీంకోర్టు హెచ్చరించింది.