తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు చెప్పుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉంటుంది. తమ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని.. ఆ సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలంటూ..చాలా మంది ఎమ్మెల్యేలను, మంత్రులను కోరుతుంటారు. అయితే.. ఓ యువకుడు ఏకంగా.. తనకు గర్ల్ ఫ్రెండ్ లేదని.. వెతికి పెట్టాలంటూ కోరడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు ఒక యువకుడు రాసిన ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూషణ్ జామువంత్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థెతెకు… తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు
తమ ప్రాంతంలో ఎందరో అమ్మాయిలు ఉన్నారని అయితే ఎవరూ తనను ఇష్టపడటం లేదని, దీంతో తనలో ఆందోళన పెరిగిపోయి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మందుబాబులకు, అల్లరిచిల్లరగా తిరిగేవారికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారని, వారిని చూసినపుడు తన గుండె తరుక్కుపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఉత్తరాన్ని చూసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు గతంలో ఇటువంటి లేఖలు ఎప్పుడూ రాలేదని, అయితే ఈ భూషణ్ జామువంత్ ఎక్కడ ఉంటాడనే విషయం తెలియలేదని, అందుకే అతని సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించానని అన్నారు. అతని ఆచూకీ తెలిస్తే, అతనికి కౌన్సెలింగ్ ఇప్పించగలుగుతానన్నారు. ఇలాంటి ఉత్తరాలు ఎమ్మెల్యేలకు రాయడం సరికాదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates