హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక మండలి కోసం నిర్వహించిన ఎన్నికల్లో నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం అయింది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడిగా సి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా ఎ.హిమబిందు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా టి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు.
పాలకమండలి సభ్యులుగా అమితారెడ్డి, తిరుపతిరావు, రమేశ్ చౌదరి, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటసోమరాజు, అశోక్ రావు, శివప్రసాద్, జగ్గారావు, రవీంద్రనాథ్, సుభాష్ ఎన్నికయ్యారు.
ఈ నూతన పాలకమండలి రెండేళ్ల పాటు కొనసాగనుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నూతన కార్యవర్గం ఈ నెల 19న తొలిసారిగా భేటీ కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates