చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది.
సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూ, పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.
రెసిడెన్షియల్ స్కూళ్ళు మినహా మిగతా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ క్లాసుల నిర్ణయం స్కూళ్ళదే అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. పాఠశాలలకు పిల్లలు రావడంపై తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎన్నో రోజులు మూతబడ్డ పాఠశాలలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి.