సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ కి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సజ్జనార్ ను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం … సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
మూడేళ్లకు పైగా సైబరాబాద్ సి పి గా పనిచేసిన సజ్జనార్… తాజాగా ఆ పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక అటు సైబరాబాద్ సిపి గా స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే… వీరిని ఎందుకు బదిలీ చేసిందనే దాని పై ఇంకా క్లారిటి రాలేదు. కాగా… సైబరాబాద్ సీపీ గా సజ్జనార్… మంచి పేరు తెచ్చుకున్నారు. దిశ మరియు వరంగల్ యాసిడ్ కేసులలో నిందితులను ఎనకౌంటర్ చేసి సీపీ సజ్జనార్… దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ని కూడా మార్చారు. ప్రస్తుతం ఉన్న ప్రభాకర్ రావును తప్పించి… ట్రాఫిక్ అదనపు సీపీగా ఉన్న అనిల్ కుమార్ ను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించింది ప్రభుత్వం. అనిల్ కుమార్ 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఇక అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్ కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా అనిల్ నియామకంతో ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చుడనున్నారు ప్రభాకర్ రావు.