తెలంగాణ రాజకీయాల్లో సత్తాచాటేందుకు వైస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆమె ఆశలన్నీ ఆదిలోనే అడియాశలు అవుతున్నాయి. ఆమె పార్టీ ప్రారంభించి కనీసం జనాల్లోకి కూడా పూర్తిగా వెళ్లకముందే ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
వైస్ షర్మిల పెట్టిన కొత్త పార్టీ కి సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేస్తూ… రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకే వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇందిరా శోభన్.
“షర్మిల వైఎస్‌ఆర్ టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణ పడి ఉంటాను. అభి మానులు, తెలంగాణ ప్రజల కోరిక మేర కే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను.” అని ఇందిరా శోభ పేర్కొన్నారు. కాగా… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఇందిరా శోభన్… ఇటీవలే వైఎస్ షర్మిల పార్టీలో చేరారు. పార్టీ ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి… వైఎస్ షర్మిల వెంట ఇందిరా శోభన్ ఉన్న సంగతి తెలిసిందే.