హైకోర్టుపై ఆరోపణలు, సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు

హైకోర్టును, హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈకేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు49 మందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో వైసీపీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు.

వరుసగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కావడంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు కోర్టు తీర్పులను తప్పుపట్టారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ పోస్టులు పెట్టారు. కొందరు ప్రముఖ నేతలు బాపట్ల ఎంపీ సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేరుగా మీడియా సమక్షంలో హైకోర్టుపై ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియాలో న్యాయస్థానాలపై తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వీటిపై చర్య తీసుకోవాలని హైకోర్టుకు న్యాయవాది లక్ష్మినారాయణ లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలంచిన హైకోర్టు ఈ కేసును సమోటోగా స్వీకరించింది.