వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఒక సామజిక వర్గాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా అజెండా సినిమా తీశారని తీవ్ర వ్యతిరేకత ఎదురైనా, ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ సాధించింది. మూడు వందల కోట్ల దాకా వసూలు చేయడం ఒక రికార్డు.
ఇప్పుడు దాని కొనసాగింపు కేరళ 2 స్టోరీ వచ్చే వారం ఫిబ్రవరి 27 విడుదలకు కానుంది. కథ ఇంచుమించు పార్ట్ 1 లాగా అనిపిస్తుండగా ఈసారి కూడా కాంట్రవర్సీ తీవ్రంగా వచ్చేలా ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే తమ రాష్ట్రంలో నిషేధించే దిశగా సంకేతాలు ఇచ్చారు.
తెలుగు డబ్బింగ్ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. వివాదాస్పదం అనిపించే అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే జన నాయకుడుకి అన్ని అభ్యంతరాలు, అడ్డంకులు చెప్పిన సెన్సార్ బోర్డుకి ఇప్పుడు కేరళ స్టోరీ 2 క్లీన్ గా కనిపిస్తోందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.
దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ప్రస్తుతం దీని గురించి స్పందించడం లేదు. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా మాత్రం సెన్సార్ క్లియరెన్స్ పట్ల ధీమాగా ఉన్నారట. ఉన్న నిజాలే చూపించామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ తీసిన దర్శకులు సుదిప్తో సేన్ ఈసారి సీక్వెల్ బాధ్యతలు తీసుకోలేదు.
టైటిల్స్ కే అభ్యంతరాలు వ్యక్తమవుతున్న టైంలో కేరళ స్టోరీ 2 నిజంగా అంత ఈజీగా థియేటర్లు వస్తోందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇదంతా ముందే గుర్తించిన మేకర్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్ గా పూర్తి చేశారు.
కేవలం పది రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేసి తక్కువ టైంలో పబ్లిసిటీ చాలనుకుని థియేటర్లకు తీసుకొస్తున్నారు. మూడు సంవత్సరాల వెనుకటి తరహాలో ఇప్పుడు కూడా ఆడేసి వెళ్లిపోతుందా లేక ఇంకేమైనా కొత్త వివాదాలు చుట్టుముడతాయా అనేది వేచి చూడాలి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా కేరళ 2 పట్ల అబ్జెక్షన్ వ్యక్తం చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates