మాన్సాస్, సింహాచలం దేవస్ధానం భూముల్లో జరిగిన అవకతవకల విషయంలో రెండు వికెట్లు పడిపోయాయి. అప్పట్లో భూములను ప్రైవేటుపరం చేయటంలోను, భూముల వివరాలు రికార్డులను మాయం చేయటంలో బాధ్యులుగా పేర్కొంటు ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమీషనర్ రామచంద్ర మోహన్ తో పాటు ఆలయ ఏఇవో అయిన సుజాతను సస్పెండ్ చేసింది.
మాన్సాస్ ట్రస్టు భూముల వివిదాంతో పాటు సింహాచలం దేవాలయ భూములు రికార్డుల నుండి మాయమైపోయిన విషయంపై పెద్ద వివాదం రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. భూముల కుంభకోణానికి బాధ్యత మీదంటే కాదు మీదేనని ఇటు వైసీపీ నేతలు అటు టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నిజానికి భూముల కుంభకోణమే కాకుండా ఇతరత్రా చాలా అవినీతి జరిగింది అశోక్ గజపతిరాజు ఛైర్మన్ గా ఉన్నపుడే.
తన హయాంలోనే ఇన్ని అవినీతి, అక్రమాలు జరిగినా అశోక్ మాత్రం వాటిని అంగీకరించటంలేదు. అశోకే ఎందుకు బాధ్యత వహించాలంటే దాదాపు 17 ఏళ్ళపాటు మాన్సాస్ ట్రస్టు+సింహాచలం దేవస్ధానం ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా అశోకే ఉన్నారు. తన హయాంలోనే వందల ఎకరాల ట్రస్టు భూములు, దేవస్ధానం భూములు ప్రైవేటుపరం అయ్యాయి. అశోక్ ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే టీడీపీ ఐదేళ్ళు అధికారంలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఏస్ధాయిలో అశోక్ హయాంలో అక్రమాలు, అవినీతి జరిగిందంటే ట్రస్టులో కనీసం ఆడిటింగ్ కూడా జరగలేదు. 2004 నుండి అసలు ఆడిటింగే జరగలేదు. ప్రతి ఏడాది ఆడిటింగ్ జరపాల్సిన బాధ్యత ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ పైన ఉన్నా దాన్ని కూడా అశోక్ అంగీకరించటంలేదు. మొత్తానికి రాజకీయపరమైన నిర్ణయాలను అమలు చేసినందుకు అదనపు కమీషనర్-2 రామచంద్రమోహన్, ఆలయ ఏఇవో సుజాతలపై సస్పెన్షన్ వేటుపడింది. మరి రాబోయే రోజుల్లో మరింతమందిపై చర్యలు తప్పేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates