టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల జట్టు అదరగొట్టింది. హాకీ చరిత్రలో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డును బద్దలు కొట్టింది. దీంతో హాకీ టీమ్‌పై ప్రశ్నంసలు కురుస్తున్నాయి. ఈ గెలుపుతో దేశ ప్రజలు గర్వంగా ఫీలవుతున్నారు.
ఇంతటి ఘనమైన చరిత్రను భారత్‌కు అందించిన హాకీ టీమ్‌కు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టీమ్‌లోని ప్రతి సభ్యుడికి కోటి చొప్పున నజరానా ఇస్తామని వెల్లడించింది. హాకీ టీమ్‌కు భారత్ వచ్చిన వెంటనే ఈ నజరానాను అందించనున్నట్లు స్పష్టం చేసింది.
కాగా ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే తైమూర్ ఓరుజ్ గోల్ చేశారు. దీంతో జర్మనీ ముందంజలో నిలిచింది.
జర్మనీ మొదటి క్వార్టర్లో భారతను ఇరకాటంతో పెట్టింది. కానీ ఆధిక్యాన్నిప్రదర్శించలేకపోయింది. 2వ క్వార్టర్లో సిమ్రంజీత్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. కానీ టోమాహాక్ షాక్ ఇచ్చారు. రెండు నిమిషాల్లోనే జర్మనీ మరో రెండు గోల్స్ సాధించింది. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది.
కానీ హార్దిక్ సింగ్ మొదటి నుంచి రీబౌండ్లో స్కోర్ చేయడంతో భారతకు రెండు పెనాల్టీ కార్నర్ ఫలితాలు వచ్చాయి. హర్మన్ ప్రీత్ సింగ్ నెట్ల వెనుకవైపు అద్భుతమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో మరో గోల్ సాధించారు. మూడో క్వార్టర్లో రూపిందర్ పాల్ సింగ్, సిమ్రంజీత్ సింగ్ మరో రెండు గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై భారత్ విజయం సాధించింది.