ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు ? ఎంతమందిని తొలగిస్తారు ? ఎలా ఉంటుంది ? ఈ సారి కూడా సోషల్ ఇంజనీరింగ్‌కే ప్రాధాన్యం ఇస్తారా ? ఇస్తే.. మాకు కూడా చోటు ఉంటుందా ? ఇదీ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. అయితే.. జగన్ వ్యూహానికి నేతల ఆలోచనలకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ మంత్రి వర్గంలో సీటు మాత్ర మే చూసుకుంటున్నారు. కానీ.. సదరు సీటు ద్వారా.. ఎంత మంది ప్రజలను వైసీపీకి చేరువచేస్తారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుని.. పార్టీని ముందుకు నడిపిస్తారు.. ? వంటి అంశాలపై జగన్ దృష్టి పెడుతున్నారు.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణతో తక్షణ ప్రయోజనాలేవీ లేవని అంటున్నారు పరిశీలకులు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సీఎం జగన్ విస్తరణను వినియోగించుకో బోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు సీఎంగా ప్రమాణం చేయకముందుగానే.. రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని జగన్ ముందుగానే చెప్పారు. అయితే టైమ్ దగ్గరపడుతున్నా దానికి సంబంధించిన సిగ్నల్స్ ఇంకా అందలేదు. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల భర్తీతో మంత్రి వర్గ విస్తరణకు కూడా త్వరలోనే సిగ్నల్ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడు ఏపీలో జరిగే మంత్రివర్గ విస్తరణను కేవలం మంత్రి పదవుల పంపకంగా చూడబోరని అంటున్నారు సీనియర్లు. రాబోయే ఎన్నికల టీమ్‌గా జగన్ ట్రీట్ చేయనున్నారని తెలుస్తొంది. రాబోయే రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి దూసుకుపోయే వాళ్లతోనే కొత్త టీమ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాంటి కీలకమైన ఎన్నికల టీమ్‌తో .. వచ్చే ఎన్నికలను బలంగా ఢీకొట్టాలని.. జగన్ భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగున్న మంత్రి వర్గ విస్తరణలో యువకులకు ఎక్కువగా పదవులు దక్కుతాయని అంటున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి సీనియర్లకు మొండి చేయి తప్పదనే అంటున్నారు. పార్టీ కోసం వాయిస్ వినిపించలేని వాళ్లు… సీనియార్టీ పేరుతో పెద్దరికం వెలగబెట్టాలని చూసే నేతలను ఈ సారి కూడా జగన్ పక్కన పెట్టేస్తారనే తెలుస్తోంది. అయితే గియితే సీనియర్లకు నామినేటెడ్ పదవులో లేదా ఇతరత్రా మేళ్లు చేకూర్చడమే తప్పా పదవులు అలంకారంగా పెట్టుకునే వాళ్లను మాత్రం ఈ సారి జగన్ కేబినెట్లోకి తీసుకోరనే తెలుస్తోంది
Gulte Telugu Telugu Political and Movie News Updates