మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరా రెడ్డి.. వైసీపీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు రఘువీరెడ్డికి అప్పగించారు. అక్కడ పార్టీ బలం పడిపోయిన తర్వాత ఆయన ఆ పదవికి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే.. ఆయన మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ కావాలని అనుకుంటున్నారట. ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత… రఘువీరా రెడ్డి.. బీజేపీలోకి వెళతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వైసీపీ వైపు అడుగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
ఒకప్పటి తన అనుచరులంతా ఇప్పుడు వైసీపీలో చేరి ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో తనతో సన్నిహితంగా ఉన్న నేతలంతా వైసీపీ, జగన్ సర్కార్ లో యాక్టివ్ గా ఉన్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, అనంత వెంకట్రాంరెడ్డి, మంత్రి బొత్సలు రఘువీరాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రఘువీరా అనుభవానికి తగ్గ గౌరవాన్ని జగన్ ఇస్తారని… త్వరలోనే రఘువీరా వైసీపీ గూటికి చేరుతారన్న ప్రచారం ఉంది. ఓ దశలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కాబోతున్నారని ప్రచారం జరిగిన రఘువీరా, రాజకీయంగా సైలెంట్ గా ఉండటం ఆయన వర్గం నేతలకు అస్సలు మింగుడుపడటం లేదు. వారంతా ఇప్పుడు వైసీపీలో ఉండటంతో రఘువీరాను కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది
Gulte Telugu Telugu Political and Movie News Updates