ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అవుననే వాదన ఎక్కువగా వినపడుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చ జోరుగా జరుగుతోంది. మంగళవారం ప్రశాంత్ కిశోర్.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయిన సంగతి తెలిసిందే., ఈ నేపథ్యంలోనే ఈ చర్చ ప్రారంభం కావడం గమనార్హం.
రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సాధారణ 2024 ఎన్నికల గురించి చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయితే అంతకంటే పెద్ద విషయంపైనే చర్చ జరిగిందంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్పడం గమనార్హం. బెంగాల్, తమిళనాడు విజయాలపై కాంగ్రెస్ పెద్దలకు ప్రశాంత్ కిషోర్ వివరించారు. తను పార్టీలో చేరితే 2024లో జరిగే ఎన్నికల్లో తన పాత్రపైనే చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తాను వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తిరిగి రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. తానో విఫల నేతనని చెప్పారు. గతంలో ప్రశాంత్ కిశోర్ నితీష్ కుమార్కు చెందిన జెడియూలో చేరిన విషయం తెలిసిందే.