అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. సీఎం జగన్ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉన్న విషయం తెలిసిందే. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా… సీఎం జగన్‌ను ఆయన సోదరుడు, జనేసనాని పవన్ విమర్శిస్తున్నా.. చిరు మాత్రం అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ నెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి ఒకే రోజు మెగా వ్యాక్సినేషన్ సండే పేరిట టీకాలు వేశారు. ఈ సందర్భంగా… టీమ్ ఏపీ, సీఎం జగన్కు అభినందనలు తెలుపుతూ.. చిరు ట్వీట్ చేశారు.
తాజాగా చిరంజీవి చేసిన ట్వీట్‌కు ముఖ్యమంత్రి రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అధికారులకే వెళ్తుందని రీట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తరపున, మీ ప్రశంసలకు ధన్యవాదాలు. విలేజ్, వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్స్, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీ వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జేసీలు, కలెక్టర్లు చేసిన ప్రయత్నానికి మీ క్రెడిట్ దక్కుతుంది’ అని జగన్ ట్వీట్ చేశారు.
చిరంజీవి చేసిన ట్వీట్‌లో ఏ ముందంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బృందాలు ఒకే రోజులో 13.72 లక్షల మందికి టీకాలు వేయడం అద్భుతం. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నాలు కొవిడ్ను ఓడించడానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. టీం ఏపీకి మరింత శక్తి రావాలి. ఉత్తేజకరమైన నాయకత్వం ఉన్న జగన్కు అభినందనలు.’ అని కొనియాడారు. అయితే.. తెలుగు ఇండస్ట్రీలో జగన్‌కు వీరాభిమానులు ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. మోహన్ బాబు, ఆలీ, పోసాని కృష్ణమురళి.. వంటివారు జగన్ వెంటే ఉన్నా.. జగన్‌ను పొగడక పోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates