ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. నూతన ఐటీ నిబంధనలకు అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను కేంద్రం ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది.
దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ట్విట్టర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విట్టర్ కోల్పోయిందని.. దీంతో ఇకపై భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక మధ్యవర్తి హోదా ఎత్తివేసిన కొద్ద గంటల్లోనే ఉత్తరప్రదేశ్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదు కావడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొంత మంది జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తి దాడి చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది.
అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించమని చెప్పినా ట్విట్టర్ తొలగించలేదని ఫిర్యాదు చేశారు. కాగా.. భారత్ లో ఈ హోదా కోల్పోతున్న తొలి సోషల్ మీడియా ఇదే కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates