తెలంగాణ టీడీపీకి భారీషాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. సీనియర్ నాయకుడు ఎల్.రమణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే తాను పార్టీని వీడనున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన అధికార పార్టీ టీఆర్ ఎస్ కండువా కప్పుకోనున్నట్టు కూడా వెల్లడించారు. వాస్తవానికి గడిచిన నెల రోజులకు పైగా ఎల్ .రమణ రాజకీయ మార్పుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పార్టీ మార డం ఖాయమని.. టీఆర్ ఎస్‌లో ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా రెడీ అయిందని.. వార్తలు వచ్చాయి.
అయితే.. ఈ వార్తలపై అటు టీడీపీ వర్గాలు కానీ, ఇటు.. ఎల్. రమణ కానీ స్పందించలేదు. ఖండించనూ లేదు. అయితే.. ఆయన ఈ నెల రోజుల్లో రెండుసార్లు.. చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఇక, తాజాగా రెండు రోజులు తన అనుచరులు, సమర్ధించే వర్గాలతో భేటీఅయిన ఎల్. రమణ.. పార్టీ మార్పుపై సంకేతాలు ఇచ్చేశారు. అయితే.. అధికారికంగా మాత్రం ఆయన సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వెల్లడించారు. తనకు పార్టీలో గౌరవం లభించిందన్న ఆయన తన అనుచరుల కోరిక మేరకే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు.
వాస్తవానికి తెలంగాణ టీడీపీపై నేతలు కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఉందన్న పేరే తప్ప.. యాక్టివ్‌గా లేదని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలోనూ వెనుకబడిపోయామని .. నాయకులు.. ఆఫ్ ది రికార్డుగా మీడియా వర్గాల ముందు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా పార్టీ అధ్యక్షుడే రిజైన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం.. ఒకరకంగా తెలంగాణ టీడీపీలో భారీ పరిణామమే అని చెప్పాలి. మరి ఇప్పుడు ఎల్.రమణ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేస్తారో.. చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates