దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా జరగడంలేదనే సంతృప్తి చాలా మందిలో ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించడంతో పాటు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. దీంతో.. సుప్రీం కోర్టు సీరియస్ కావడంతో.. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
వ్యాక్సిన్లను పెంచేలా చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్ -ఈ కి వ్యాక్సిన్ల కోసం రూ. 1500 కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపింది. యూఎస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో బయోలాజికల్- ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మొదటి, రెండు దశల ప్రయోగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. మూడో దశ ప్రయోగాల కోసం గత ఏప్రిల్‌లోనే సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి కూడా వచ్చింది. దీంతో భారత్‌లో ఈ టీకా ఉత్పత్తి చేసేందుకు తమకు అడ్వాన్సుగా రూ. 1500 కోట్లు ఇవ్వాలని బయోలాజికిల్ -ఈ సంస్థ కోరింది.
ఆగస్టు- డిసెంబర్ కల్లా 30 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. దీంతో కేంద్రం ఆ 30 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రిజర్వ్ చేయడానికి ముందస్తు చెల్లింపు చేసేందుకు ముందుకొచ్చింది. బయోలాజికల్- ఈ రూపొందిస్తున్న టీకాలో RBD ప్రోటీన్ సబ్-యూనిట్ సమ్మేళనంతో కూడి పదార్థం ఉంటుందని సమాచారం.