రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు. రాజకీయాల్లో కానీ, వ్యాపారాల పరంగా కానీ.. నెల్లూరు రెడ్లకే ప్రధాన ప్రాధాన్యం ఉంటుంది. ఇటు వైసీపీలోను.. అటు టీడీపీలోను.. ఇతర పార్టీల్లోనూ రెడ్డి సామాజిక వర్గమే నెల్లూరును శాసిస్తోంది. అయితే.. వెంకటగిరి, నెల్లూరు సిటీ.. వంటి కొన్ని చోట్ల చంద్ర బాబు ప్రయోగాలు చేసి.. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారికి టికెట్లు ఇచ్చినా.. కొన్నాళ్లు ఫలితం ఇచ్చాయే తప్ప.. తర్వాత మళ్లీ రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ సత్తా చాటింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఒక్క నెల్లూరు సిటీ(అనిల్ కుమార్ యాదవ్) తప్ప.. జిల్లా మొత్తం.. రెడ్లు విజయం దక్కించుకున్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ రెడ్లు.. పాగా వేశారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి.. ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే నాలుగు నియోజకవర్గాలు.. నెల్లూరులోనే ఉన్నాయి. ఒక్క గూడూరు, సూళ్లూరుపేట తప్ప.. వెంకటగిరి, సర్వేపల్లి జనరల్ నియోజకవర్గాలు. అయితే.. ఎస్సీ నియోజకవర్గాల్లోనూ డామినేషన్ మాత్రం రెడ్డి సామాజిక వర్గానిదే కావడంతో ఇక్కడి రెడ్లు ఎటు వైపు నిలుస్తారనే చర్చ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితిని తీసుకుంటే.. మంత్రి పదవులు ఆశించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డిల ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
ఇక, నియోజకవర్గం అభివృద్ధి నిధులు కూడా తమకు దక్కడం లేదని.. అధికారులు సైతం తన మాట వినడం లేదని..కొన్నాళ్లుగా ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన తాజా ఎన్నిక లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇక, కాకాని గోవర్ధన్‌రెడ్డి.. పర్యవేక్షణ బాగానే ఉన్నా.. రెడ్లకు జగన్ సర్కారు ఏం చేసిందనే వాదన రెడ్డి సామాజిక వర్గంలో జోరుగా వినిపిస్తోంది. రెడ్డి రాజ్యం వస్తే.. తమ పరిస్థితి బాగుంటుందని భావించిన నెల్లూరు రెడ్లకు ఇప్పుడు ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఏ పనిచేయాలన్నా.. మంత్రి అనిల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోలోన గుసగుస వినిపిస్తోంది.
దీంతో నెల్లూరు రెడ్లు ఈ దఫా ఫిఫ్టీ పర్సంట్.. వైసీపీకి ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈ వోటు బ్యాంకు ఏమైనా.. టీడీపీకి మళ్లుతుందా? అంటే అది కూడా కష్టంగానే ఉంది. చంద్రబాబుపై పూర్తి విశ్వాసం రెడ్డి సామాజిక వర్గంలో కలగలేదు. సో.. వీరు తటస్థంగా మారే అవకాశం ఉంది. ఇక, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరుల్లోని కమ్మ సామాజిక వర్గం టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రెడ్లు పోయినా.. కమ్మలపైనే టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇలా.. నెల్లూరు రెడ్లు ఫిఫ్టీ పర్సంట్ తటస్థంగా మారుతున్నారనే అంచనాలు వస్తుండడంతో మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి సామాజికవర్గంతో భేటీలు నిర్వహించడంతోపాటు.. కీలక నేతలకు పోన్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 16, 2021 7:01 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…