వివాదాలకు కేంద్రంగా, ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న మంత్రి కొడాని నాని.. టీడీపీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిపై తీవ్ర విమర్శలు చేశారు. ఔట్ డేటెడ్ నాయకురాలు.. అని వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. సహజంగానే టీడీపీ అంటేనే విరుచుకుపడే మంత్రి నాని.. తాజాగా టీడీపీ అభ్యర్థి పనబాకపై కూడా అదే తరహాలో విరుచుకుపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి స్పందించిన మంత్రి కొడాలి నాని.. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే.. వెంటనే స్పందించేవారుగా ఉండాలని అన్నారు. కానీ, పనబాక లక్ష్మి మాత్రం ఆమె బాడీ సహకరించదని.. కూర్చుంటే లేవలేరని.. లేస్తే.. కూర్చోలేరని.. ఇలాంటి నాయకురాలు ప్రజలకు ఏం చేస్తారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆమె ఔట్ డేటెడ్ నాయకురాలని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.
రాజకీయాల్లో ఉన్నవారు.. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా.. ఇలా వ్యక్తిగత విషయాలు.. శారీరక అంశాలను కూడా రాజకీయంగా వివాదాస్పదం చేయడం.. వాటిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించడం వంటివి తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ఈ నెల 17న జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా మంత్రి వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates