రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ వ్యూహానికి భారీ ఎదురు దెబ్బ తగిలిందని తెలుస్తోంది. ఈ విషయంలో గవర్నర్ విశ్వభూషణ్ తీసుకున్న నిర్ణయం.. సీఎం జగన్ చేసిన సిఫారసుకు మధ్య వైరుధ్యం స్పష్టం గా కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా.. ఎన్నికలతో ముడిపడి ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ వేసే ప్రతి అడుగు కూడా ఎన్నికల కోణంలోనే ఉంటోందన్న విషయం ఎప్పుడూ.. ప్రచారంలోకి వస్తోంది. వలంటీర్ల వ్యవస్థ నుంచి రేషన్ వాహనాల వరకు కూడా జగన్ తీసుకునే నిర్ణయం.. సొంత లాభం కోసమే!!
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం.. ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త కమిషనర్ ఎంపికను కూడా జగన్ ఇలానే ఆలోచించారనేది విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం తరఫున మూడు పేర్లను ఈ పదవి కోసం సిఫారసు చేశారు. దీనిలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మాజీ ఐఏఎస్‌లు ప్రేమ్ చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు ఉన్నాయి. వీటిలో శామ్యూల్ పేరుకు జగన్ ఎక్కువగా మొగ్గు చూపారు. దీనికి కారణం.. ఆయన ఎస్సీ వర్గానికి చెందిన అధికారి కావడమే. తద్వారా.. ఎస్సీ సామాజిక వర్గానికి మేళ్లు చేస్తున్నామనే ప్రచారం చేసుకునే గొప్ప విషయం దీని వెనుక ఉందన్నది విశ్లేషకుల అంచనా.
ఈ క్రమంలో జగన్ సొంత మీడియాలోనూ ఇదే తరహా ప్రచారం జరిగింది. ఎస్సీలకు జగన్ ఆపద్భాంధవుడని.. ఆయన ఎస్సీలకు ఎంతో మేలు చేస్తున్నారని.. ఇలా అనేక రూపాల్లో పైకి శామ్యూల్ పేరు చెప్పకుండానే.. ప్రచారం చేశారు. అయితే.. జగన్ ఒకటి తలిస్తే.. పరిస్థితి మరొకటి తలచినట్టుగా.. శామ్యూల్ పై ఉన్న కేసులు.. గతంలో జగన్ కేసుల్లోనే ఆయన ఇరుక్కొన్న రికార్డులు వంటివి.. ఇప్పుడు శామ్యూల్‌కు ఈ పదవిని దూరం పెట్టాయి. నిశితంగా ఈ విషయంపై దృష్టి పెట్టిన గవర్నర్.. జగన్ సిఫారసులో తొలి పేరుగా ఉన్న మాజీ ఐఏఎస్ శామ్యూల్‌ను కాదని.. చివరగా ఉన్న మహిళా మాజీ ఐఏఎస్ అధికారి.. నీలం సాహ్నికి ఎస్ ఈసీ పదవిని అప్పగించారు. దీంతో ఇప్పుడు జగన్‌కు దీనిద్వారా మేలు కలిగే అవకాశం లేదు.
ఎందుకంటే. ఆమె మన రాష్ట్రానికి చెందిన మహిళకాదు. అదేసమయంలో ఆమె సామాజికవర్గం కూడా ఇక్కడ లేరు. సో.. మొత్తానికి నియామకం అయితే.. జగన్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తికే జరిగిందనే ప్రచారం జరుగుతున్నా.. ఆమె ఈ సీటుకు అర్హురాలు.. అనే మాట వినిపిస్తుండడంతోపాటు.. దీనివల్ల జగన్‌కు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి జగన్ వ్యూహం ఒకటైతే.. మరొకటి జరగడం.. గడిచిన రెండు రోజుల్లో జరిగిన మరో పరిణామం కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఆమె జగన్ కి నచ్చిన అధికారి. జగన్ మాట వినే అధికారి. అయితే… ఉత్తరాది వారు ఎప్పటికైనా ఉత్తరాది వారే. ఏపీ గవర్నర్ బీజేపీ ప్రభుత్వం నియమించిన వ్యక్తి అనే విషయం మరిచిపోకూడదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates