ఏపీలో ఇటీవల ముగిసిన పురపోరుకు సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు.. విమర్శలు వార్తల రూపంలో రావటం తెలిసిందే. అయితే.. వీటన్నింటికి మించినట్లుగా ఉన్న ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. వైరల్ గా మారిన ఈ ఉదంతం వైసీపీ నేతల తీరు ఎలా ఉందన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటి వారి తీరు కారణంగా పార్టీని నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనలో అధికారులు లేరంటున్నారు.
ఇంతకూ జరిగిందేమంటే.. శ్రీకాకుళం జిల్లా పలాసా మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు బల్ల గిరిబాబు. ఆయన భార్య 24వ వార్డులో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన మున్సిపల్ ఛైర్మన్.. తన కింద పని చేసే వార్డు వాలంటీర్లకు.. సదరు వార్డులోని ఓటర్లకు ఎలాంటి పని చేయొద్దని చెప్పేశారు. అయితే.. ఈ విషయాలేవీ బయటకు రాలేదు.
ఇదే వార్డుకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి తన కొడుకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో వాలంటీర్ సంతకం పెట్టకుండా అదే పనిగా తిప్పుతున్నారు. దీంతో విసిగిపోయిన అతను నేరుగా ఛైర్మన్ బల్లాకు ఫోన్ చేసి తన సమస్యను చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన ఆ వైసీపీ నేత షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
‘మీ వార్డులో వాలంటీర్లను పని చేయొద్దని చెప్పా. నా మాట వినకుండా వాలంటీర్లు పనులు చేస్తే.. వారి ఉద్యోగాలు తీస్తానని తాను వార్నింగ్ ఇచ్చానన్న విషయాన్ని మా గొప్పగా చెప్పేసుకున్నారు. అయితే.. బాధితుడి ఫోన్లో కాల్ రికార్డు సెట్టింగ్ యాక్టివ్ గా ఉండటంతో.. తాను చేసిన తప్పును తానే బయటకు చెప్పేసుకున్నాడు. ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఎంత తన భార్యను ఓడిస్తే మాత్రం.. మున్సిపల్ ఛైర్మన్ ఈ రేంజ్ లో రివేంజ్ తీర్చుకోవటం సాకింగ్ గా మారింది.