పార్టీ ప్రకటనకు ముహూర్తం కుదిరిందా ?

తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్న షర్మిల పార్టీ పేరు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలై 8వ తేదీన పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల రెడీ అవుతున్నట్లు సమాచారం. జూలై 8 అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. కాబట్టి అదే రోజుల పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ పేరును వైఎస్సార్ టీపీ అని డిసైడ్ చేశారట. ఏపిలో ఇప్పటికే వైఎస్సార్ సీపీ పేరుతో పార్టీ పాపులరైపోయింది. ఇదే పేరు తెలంగాణాలో కూడా క్షేత్రస్ధాయిలో జనాల్లో నానుతోంది. కాబట్టి వైఎస్సార్సీపీని పోలి ఉండేట్లు వైఎస్సీర్టీపీ అని పెడితే సరిపోతుందని షర్మిల అనుకున్నారట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తరపున ఏమైనా అభ్యంతరాలు వస్తాయా ? అనే అనుమానిస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ఇఫ్పటినుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంను షర్మిల వ్యూహాత్మకంగానే ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయకపోయినా ఖమ్మం జిల్లాలో ఓ ఎంపి+ముగ్గురు ఎంఎల్ఏలు వైఎస్సాసీపీ తరపున గెలిచారు. దాంతో వైఎసార్ కున్న జనబలం అర్ధమవుతోంది.

తెలంగాణాలోని చాలా జిల్లాల్లో వైఎస్సార్ కు మద్దతుదారులు, అభిమానులున్నారు. వారందరినీ సంఘటితం చేయటం ద్వారా గట్టి ఫోర్సుగా తయారవ్వాలని షర్మిల భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయంగా పెద్ద వ్యాక్యూమ్ ఉందన్నది షర్మిల భావన. కాంగ్రెస్, టీడీపీలు దాదాపు నామమాత్రమైపోయాయి. బీజేపీ కూడా ఏదో కాస్త ఊపులో ఉందే కానీ నిజమైన బలం కాదని అనుమానిస్తున్నారు. అందుకనే ఆ గ్యాప్ ను భర్తీ చేయటానికే షర్మిల రెడీ అవుతున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)