ఆకాశంలో సగం అంటాం కానీ.. మహిళలకు లభిస్తున్న స్థానం అందరికి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో మహిళలు తమకు తాముగా సవాళ్లు ఎదుర్కొని దూసుకెళుతున్న వారెందరో. ‘నేనో మహిళను.. నేనేం చేయగలను?’ అన్న ప్రశ్న చాలా మంది నోటి నుంచి వినిపిస్తుంది. కానీ.. తమలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలామంది అత్యుత్తమ స్థాయిలకు చేరుకున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. వివిధ రంగాల్లో ఇప్పటికే దూసుకెళుతున్న మహిళలు.. రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం తక్కువనే మాట వినిపిస్తుంటుంది. తరచి చూస్తే.. తమ సత్తా చాటుతూ మహిళా అధినేతలుగా అధికారాన్ని చలాయిస్తున్న వారు చాలామందే కనిపిస్తారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 21 మంది మహిళా నేతల్ని చూస్తే.. వావ్ అనాల్సిందే. ఇంతకీ వారెవరంటే..?
- సాన్ మారిన్.. ఫిన్ ల్యాండ్ ప్రధానిగా 2019 నుంచి వ్యవహరిస్తున్నారు.
- సోఫియా విలిమ్స్.. బెల్జియం ఉప ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు
- మిటే ఫ్రెడ్రిక్ సేన్.. డెన్మార్క్ ప్రధానిగా 2019 నుంచి పని చేస్తున్నారు
- జుజానా కాప్యుటోవా.. స్లోవేకియా అధ్యక్ష స్థానంలో 2019 నుంచి ఉన్నారు
- సాల్మో జురబ్లిసేవ్.. జార్జియా అధ్యక్ష స్థానంలో 2018డిసెంబరు నుంచి వ్యవహరిస్తున్నారు
- షాలే వర్క్ జువ్డీ.. ఇథోపియా అధ్యక్ష స్థానంలో 2018 అక్టోబరు నుంచి పని చేస్తున్నారు
- మియా మోట్ల్నే.. బార్బడోస్ ప్రధానిగా 2019 మే నుంచి పదవిలో ఉన్నారు
- కేట్రిన్ జాకోబస్ట్రీ.. ఐస్ ల్యాండ్ ప్రధానిగా 2017 నవంబరు నుంచి ఉన్నారు
- జసిండా అడ్రెన్.. న్యూజిలాండ్ ప్రధానిగా 2017 అక్టోబరు నుంచి పని చేస్తున్నారు.
- హలిమాహ్ యాకోబ్.. సింపూర్ అధ్యక్ష స్థానంలో 2017 సెప్టెంబరు నుంచి ఉన్నారు
- అనే బ్రానబిక్.. సెర్బియా ప్రధానిగా 2017 జూన్ నుంచి పదవిలో ఉన్నారు.
- క్రిస్టీ కలిజులాడీ.. ఈస్టోనియా అధ్యక్ష స్థానంలో 2016 అక్టోబరు నుంచి ఉన్నారు
- టసాయ్ ఇంగ్ వున్.. థైవాన్ అధ్యక్షస్థానంలో2016 మే నుంచి ఉన్నారు.
- బిద్యా బనాద్రి.. నేపాల్ అధ్యక్షురాలుగా 2015 అక్టోబరు నుంచి వ్యవహరిస్తున్నారు
- సారా అమిదిలా.. నమీబియా ప్రధానిగా 2015 మార్చి నుంచి పని చేస్తున్నారు.
- ఎర్నా స్లోబర్గ్.. నార్వేప్రధానిగా 2013 నుంచి ఇప్పటికి కొనసాగుతున్నారు
- షేక్ హసీనా.. బంగ్లాదేశ్ ప్రధానిగా 2009 జనవరి నుంచి ఉన్నారు.
- ఎంజెలీనా మార్కెల్..జర్మనీ ఛాన్స్ లర్ గా 2005 నుంచి ఉన్నారు
- కాజా కల్లాస్.. ఈస్టోనియా ప్రధానిగా 2021 జనవరి నుంచి వ్యవహరిస్తున్నారు.
- మియా సండూ.. మాల్డోవా అధ్యక్ష స్థానంలో 2020డిసెంబరు నుంచి ఉన్నారు.
- ఇన్ గ్రిడా సిమోనోటి.. లుధియానా అధ్యక్షురాలిగా 2020 నవంబరు నుంచి పని చేస్తున్నారు.