టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ సర్కారు సహా సీఎం జగన్‌పై నిప్పులు కురిపించారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో పర్యటించి పార్టీ శ్రేణులతో భేటీ కావాలని భావించిన చంద్రబాబుకు తిరుపతి పోలీసులు అడ్డు చెప్పారు. నగరంలోకి అనుమతి లేదని.. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని.. బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ హఠాత్పరిణామం తో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలోనే భేటీ అయ్యి.. నిరసన తెలుపుతున్నారు.
గత మూడు గంటలుగా ఆయన రేణిగుంట విమానాశ్రయంలోనే చంద్రబాబు కూర్చోవడం గమనార్హం. ఇక, ఈ క్రమంలోనే ట్వీట్టర్ వేదికగా .. చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం.. తనను అడ్డుకోలేదని.. తనను ఎవరూభయపట్టలేరని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక, జగన్‌ను ఉద్దేశించి కీలక కామెంట్లు కుమ్మరించారు. భయంతో ఎన్ని రోజులుపాలిస్తావు, ప్రజలను కలుసుకోకుండా అడ్డుకుంటారా?
ఇక, నైనా జగన్ పరిణితి సాధించాలి. అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్.. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతలకు ఎదురవుతున్న పరిణామాలను నిలదీసేందుకు చంద్రబాబు బయలు దేరారు. ఈ క్రమంలోనే ఆయనను అడ్డుకున్నారు. ఇక, మరోవైపు .. పోలీసులు చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. నగరంలో యాక్ట్ 30 అమల్లో ఉందని.. నిరసనలకు, పర్యటనలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కలెక్టర్, ఎస్పీలతో భేటీ అవుతానని చెప్పారు. అయినా.. కూడా చంద్రబాబును అనుమతించకపోవడం గమనార్హం. మొత్తంగా ఈ పరిణామం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.