ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.
మామూలుగా అయితే షర్మిల తో ఆళ్ళ భేటి పెద్ద విశేషం ఏమీకాదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాత్రం కచ్చితంగా ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లాకు షర్మిల వెళుతున్నారు. ఇటువంటి సమయంలో ఆళ్ళ స్వయంగా లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి వెళ్ళటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ఎంఎల్ఏ ఆళ్ళ చాలా సన్నిహితుడన్న విషయం తెలిసిందే. షర్మిలతో మాట్లాడేందుకు తన తరపున జగన్ మంగళగిరి ఎంఎల్ఏను పంపించారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా దాదాపు గంటసేపు షర్మిలతో ను తర్వాత ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్ తోను ఆళ్ళ విడివిడిగా భేటి అయ్యారు. దాంతో వీళ్ళ భేటిపై రాజకీయంగా ఆసక్తి పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates