వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే! దీనికి సంబంధించిన సన్నాహక సమావేశానికి తొలి అడుగు పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని వైసీపీ ఒకప్పటి కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌కు చేరుకున్న షర్మిల.. ఆదిత్యం.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపించారని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే వ్యవహరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత.. పార్టీని తనవైపు తిప్పుకొన్న జయ.. అనూహ్యంగా ఎదిగారు.
ఈ క్రమంలో ఆమె తొలి భేటీ ఏర్పాటు చేసినప్పుడు.. అచ్చు ఇంతే గోప్యత పాటించారని.. అప్పటి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం షర్మిల కూడా అచ్చు జయలలితను తలపించారని చెబుతున్నారు. వైట్ శారీ ధరించిన షర్మిల.. ఆకుపచ్చ-లైట్ నీలం రంగు కలగలిసన పువ్వులతో ఉన్న బోర్డర్ ఉన్న చీరను ధరించారు. అదేవిధం వైట్ బ్లౌజ్ ధరించారు. అప్పట్లో జయలలిత కూడా అచ్చు ఇలాంటి చీరనే కట్టుకున్నారు. వైట్ శాంతికి చిహ్నం కాగా, ఆకుపచ్చ.. రంగు.. సౌభ్రాతృత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. ఇక, లైట్ నీలం(స్కై బ్లూ) రంగు.. మానవత్వానికి ప్రతీక.
ఇలాంటి చీరను అప్పట్లో జయ ధరించడం విశేషం. ఇక, పలకరింపులోనూ అచ్చు జయను పోలి ఉన్నారు షర్మిల. ఎడం చేయిని గాలిలోకి ఊపు తూ.. రెండు చేతులు ఎత్తి తన అభిమానులకు నమస్కారం చేశారు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే చేశారు. అదేవిధంగా విజయ సంకేతంగా పేర్కొనే రెండు వేళ్లను గాలిలోకి ఊపుతూ.. అభిమానులను పలకరించారు షర్మిల. చెరగని చిరునవ్వుతో.. అభిమానులను ఉద్దేశించి.. పలకరింపుగా వ్యవహరించారు.
ఇక, జుట్టు విషయానికి వచ్చినా.. ఆనాడు జయ అవలంబించిన తీరులోనే షర్మిల వ్యవహరించారు. జడ వేసుకోకుండా.. విరబోసుకున్న కురులకు.. చివరన ముడి వేసుకున్నారు. ఆనాడు జయలలిత కూడా ఇలాంటి కురులతోనే ఉండడం గమనార్హం. ఇలా అనేక పోలికలు.. జయలలితను పోలి ఉండడంతో షర్మిల ఎంట్రీ అత్యంత ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates