వైసీపీ మీద మరోసారి విరుచుకొని పడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ ఒక డెడ్ బాడీ అని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. సాదాసీదాగా కనిపించే ఆయన ప్రత్యర్థుల మీద చేసే కామెంట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మండుతున్న పుండు మీద కారం చల్లినట్టు భగ్గుమంటాయి. గతంలో అనేకసార్లు వైసీపీ మీద తనదైన స్టైల్లో చేసిన విమర్శలు వివాదం అయ్యాయి. వైసీపీని అరాచక పార్టీగా అభివర్ణించిన ఆయన అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలగలిస్తే వైసీపీ పార్టీ అవుతుందని చురకేశారు. ఇప్పుడు అదే రకమైన కామెంట్ చేశారు.
తాజాగా వైసీపీని మృతదేహంగా అభివర్ణించడం వివాదాస్పదం అయ్యింది.
వైసీపీ ఒక డెడ్ బాడీ. అది ఎప్పుడో చనిపోయింది. బతికిఉన్నట్టు భ్రమలో తిరుగుతుంది. మేము దాన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం అని నాగబాబు చేసిన విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ మీద నాగబాబు విరుచుకొని పడ్డారు. వైసీపీ ఎప్పుడో మరణించిందని, దాంట్లో ప్రాణం లేదని చెప్పారు. ఆ పార్టీ గురించి వర్రీ పడొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. నేనెవర్ని విమర్శించడానికి రాలేదని చెబుతూనే ఘాటుగా విమర్శలు చేయడంతో అక్కడ వున్న కార్యకర్తల్లో హుషారు నింపినట్లయ్యింది.
నాగబాబు చేసే విమర్శలేప్పుడూ అలాగే వుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఏదో గొంతు చించుకున్నట్లు మాట్లాడరు. సుత్తి లేకుండా సుతిమెత్తగా కత్తి దింపినట్టు మాట్లాడటం నాగబాబు స్టైల్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేసిన వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి నోళ్లు మూయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates