మోడీ-కేసీఆర్.. ఒక పేలిపోయే మీమ్

లాక్ డౌన్ ఆరంభమైన కొత్తలో మోడీ సర్కారు పట్ల చాలా సానుకూలంగా కనిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. కేంద్రం మీద ఇంతెత్తున లేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన సాయం అందట్లేదని.. మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు.

నిన్నటి ప్రెస్ మీట్లో కేంద్రం మీద ఆయన ఎలా విరుచుకుపడ్డారో తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రం ఈ నెల 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తే.. కేసీఆర్ ఏమో 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని అన్నారు. ఈ ఆంక్షల విషయంలో కేసీఆర్ మొదట్నుంచి కేంద్రం కంటే ఒక అడుగు ముందు ఉండటం.. కేంద్రం ఎప్పుడు లాక్ డౌన్ ప్రకటన చేయడానికి ముందో, వెనుకో వచ్చి రాష్ట్రంలో మరింత ఎక్కువ కాలం లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటన చేస్తుండటం గమనార్హం.

ఈ విషయంలో మోడీ-కేసీఆర్ మధ్య వేలం పాట తరహాలో వ్యవహారం నడుస్తోందంటూ ఓ నెటిజన్ పేలిపోయే మీమ్ ఒకటి తయారు చేశాడు. ఐపీఎల్ వేలం జరిగినపుడు ఒక ఆటగాడికి ఓ ఫ్రాంచైజీ ఒక రేట్ కోట్ చేస్తే దాని మీద హైక్‌తో ఇంకో జట్టు బిడ్ వేయడం చూస్తుంటాం. దాంతో ఈ విషయాన్ని పోలుస్తూ మీమ్ రూపొందించారు.

మోడీ మొదటగా మార్చి 28 వరకు లాక్ డౌన్ అంటే.. కేసీఆర్ 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. తర్వాత మోడీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తే.. కేసీఆర్ ఏప్రిల్ 30 అంటూ కొత్త గడువు విధించార. తర్వాత మే 3 వరకు లాక్ డౌన్ అంటూ ప్రకటన చేస్తే.. కేసీఆర్ మే 7 అంటూ కొత్త డేట్ ఇచ్చారు. ఇంతలో మోడీ వచ్చి మే 17 వరకు మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మోడీ ఏం చేయబోతున్నాడో ఇంకా తేలలేదు. ఈలోపు కేసీఆర్ వచ్చి తెలంగాణలో లాక్ డౌన్ మే 29 వరకు ఉంటుందని ప్రకటించాడు. దీంతో ఈ వ్యవహారం వేలం పాటలా ఉందంటూ మీమ్ ద్వారా కామెడీ చేశారు.