Political News

బీజేపీ వల్లే అనంతపురం చేజారిందా?

ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క అనంతపురం కార్పొరేషన్ మాత్రమే వైసీపీ దక్కించుకుంది. దీనికి బీజేపీ వేసిన తప్పుతడుగులే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి నాయకుల అంతర్గత చర్చల్లో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది.

అనంతపురం కార్పొరేషన్లో మొత్తం మొత్తం 1,33,871 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ కు 62,219 ఓట్లు పడగా బీజేపీ అభ్యర్ధికి 56,238 ఓట్లు పోలయ్యాయి. 5,981 ఓట్ల భారీ మెజారిటీతో రమేష్ గౌడ్ గెలుపొందారు. 62 డివిజన్లకుగాను టీడీపీ 31, వైసీపీ 20, 6 చోట్ల జనసేన, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కౌంటింగ్ చివరి నిముషం వరకు ఉత్కంఠగా కొనసాగింది. అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచింది. చివరికి వైసీపీ అభ్యర్థిని డిక్లయిర్ చేశారు.

నిజానికి అనంతపురంలో టీడీపీకి మంచి కేడర్ వుంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నాయకులు పలువురు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అయితే పొత్తులో భాగంగా మేయర్ సీటు బీజేపీ దక్కించుకుంది. అభ్యర్థి ఎంపిక దగ్గరే తప్పుతడుగులు వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీలో చాలా మంది సీనియర్ నాయకులు వున్నారు. వారందరినీ కాదని యువజన విభాగం నాయకుడైన కోట్ల అజేష్ యాదవ్ కు సీటు కేటాయించారు. అది కూడా చివరి నిమిషంలో టికెట్ కేటాయించారు. ఇది పార్టీలోని పాత కాపులకు, సీనియర్ నాయకులకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. వారు ఎన్నికల్లో మనస్ఫూర్తిగా సహకరించక పోవడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది.

అంతేకాకుండా మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా నిలిచి గెలిచే పరిస్థితులు లేవు. వాస్తవ బలాన్ని అంచనా వేసుకోకుండా బీజేపీ అతి విశ్వాసంతో వ్యవహారించింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దాంతో కూటమి మధ్య సమన్వయం దెబ్బతిన్నది. మున్సిపల్ పరిధిలో సాధ్యంకాని హామీలు ఇచ్చింది.

స్థానిక సమస్యలను గాలికి వదిలేసి అనంతపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని వాగ్దానాలు చేయడం ప్రజలు పట్టించుకోలేదు. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్థానికంగా బలంగా వున్న టీడీపీ, జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లేలా ప్రణాళికలు వేయకుండా, బీజేపీ అగ్రనాయకత్వం వచ్చి ప్రచారం చేసి చేతులు కాల్చుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on November 4, 2026 6:24 pm

Share

Recent Posts

‘మావిగ‌న్’ ముంచేసింద‌న్నో !

మావిగ‌న్‌.. (మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు న‌గ‌రాల‌తో కూడిన రాజ‌ధాని) జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిందే!. దీనినే త‌మ…

1 hour ago

సందీప్ వీటికి దూరంగా ఉంటే బెటర్

ఇటీవలే అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విద్యార్థినిపై మెషీన్ రంపంతో దాడి జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

1 hour ago

‘నేనున్నాను.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుందాం’

ముర‌సు తుఫాను ప్ర‌భావంతో ఏపీలోని ప‌లు జిల్లాలు అత‌లాకుత‌లం అయ్యాయి. రాజ‌ధాని అమ‌రావతికి చేరువగా ఉన్న బాప‌ట్ల‌, ఎన్టీఆర్‌, కృష్ణా,…

2 hours ago

దీపావళి ధమాకా… ఆఫీస్ టేబుల్ పై ఐఫోన్ గిఫ్ట్!

దీపావళి పండుగ వచ్చిందంటే ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు అందించడం చాలా కంపెనీల్లో ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఓ…

2 hours ago

న‌న్ను ఓడించారు.. నా డ‌బ్బులు నాకివ్వండి: వైసీపీ అభ్య‌ర్థి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌కు భారీ షాకే త‌గిలింది. ఈ క్ర‌మంలో కొంద‌రు మాత్ర‌మే విజ‌యం ద‌క్కించుకోగా.. మెజారిటీ…

3 hours ago

ప్రశ్నిస్తే సరిపోదు..పోటీ చేయాలి షర్మిల!

ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ…

4 hours ago