గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ జెండాను కాలికింద వేసి తొక్కారు. ఇది వివాదాస్పదం అయ్యింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సినిమా స్టైల్లో వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. నాయకుడంటే అలా వుండాలని తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే….
గుడివాడ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ఎమ్మెల్యే రాము 28వ వార్డు పరిధిలోని బొమ్ములూరులో కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ వున్న వైసీపీ కార్యకర్తలు కొందరు టీడీపీ కార్యకర్త చేతిలో వున్న జెండా లాక్కొని కింద పడేసి కాలితో తొక్కారు. టీడీపీ కార్యకర్తలు అడ్డు చెబుతున్నా వినకుండా దౌర్జన్యం చేశారు. అయితే ప్రచారంలో వున్న ఎమ్మెల్యే రాముకి ఈ విషయం తెలియదు. బొమ్మలూరులో ప్రచారం ముగించుకొని వెళ్లిపోయాక ఆయనకు ఈ విషయం తెలిసింది. అంతే…
అగ్రహానికి గురైన ఎమ్మెల్యే రాము వెంటనే బొమ్మలూరుకు వెళ్లిపోయారు. వెంట కార్యకర్తలు, నాయకులు ఎవరూ లేకుండా ఒంటరిగా మోటారు బైకు మీద నేరుగా వైసీపీ ప్రచార శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలతో చర్చిస్తున్న కొడాలి నాని అనుచరుడు శశిభూషణ్ ను పిలిచారు. ఎన్నికల ప్రచారంలో మీ వాళ్ళు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. టీడీపీ జెండా కాలితో తొక్కిన సంగతి చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? టీడీపీ జెండా తొక్కిన మీ వాళ్ళను పిలిపించు, క్షమాపణ చెప్పించు, లేకపోతే ఊరుకోనంటూ ఫైర్ అయ్యారు. దాంతో అక్కడ వున్న కొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి తరఫు కొందరు టీడీపీ జెండా తొక్కారని స్థానిక నాయకులు తెలిపారు. దాంతో…వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి అరాచకవాది అని అందరికీ తెలుసని.. అలాంటి వాడి వెనుక ఇలాంటి వాళ్లే ఉంటారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఎమ్మెల్యే రాము సినిమా తరహాలో నేరుగా వైసీపీ శిబిరం వద్దకు వెళ్లి వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on November 24, 2026 8:39 pm
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగులకు సేవలు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్…
2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…
``నువ్వు కొంచెం గ్లామర్‌గా ఉండాలి. పంజాబీ డ్రస్.. నీకు బాగుంటుంది. చీరల సెలక్షన్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…
వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…
బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…
కీడా కోలా నుంచి ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నటుడిగా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఇటీవలే…