ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి ఇంకో ఆరు నెలలు బాధపడి, కొత్తది మొదలుపెట్టాలా వద్దాని అవసరం లేని ఒత్తిడి లోనై బోలెడు సమయం వృథా చేస్తున్న ట్రెండ్ ఇది. అలాంటిది ఏడు పదుల వయసులో ఉన్న స్టార్ హీరోలు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కాలక్షేపం చేయడం సహజం. కానీ చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి లాంటి సీనియర్లు అబ్బే వయసు మా శరీరానికే, మాకు కాదని చాలా బిజీగా టైం వేస్ట్ చేయని ప్లానింగ్ లో ఉన్నారు.
మెగాస్టార్ విషయానికి వస్తే ఒకేసారి ఆయన మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొదటిది సంక్రాంతికి విడుదల కావాలని కంకణం కట్టుకున్న కాకా షూటింగ్ కు అవసరమైనంత సమయం కేటాయించడంతో పాటు దర్శకుడు బాబీ కొల్లి కోరినట్టుగా మేకోవర్ అవుతూ ఫుల్ ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంకోవైపు నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న టాక్ షో మెగావర్స్ కోసం వారానికి ఒకటి రెండు ఎపిసోడ్లలో పాల్గొంటూ ఒక రోజు మొత్తం దానికే కేటాయిస్తున్న వైనం అన్నపూర్ణ స్టూడియోస్ లో గమనించవచ్చు.
ఇవి కాకుండా విశ్వంభర ఫైనల్ కాపీని లాక్ చేసే బాధ్యత చిరంజీవి మీద ఉంది. విఎఫ్ఎక్స్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. చిరు ఎస్ చెబితే కానీ థియేటర్ రిలీజ్ డేట్ ప్రకటన చేయలేరు. కాకా పండగ బరి నుంచి తప్పుకునే సూచనలు తగ్గిపోవడం యువి నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ఇంత ఆలస్యం అయ్యింది కాబట్టి విశ్వంభరకు సంబంధించి ప్రతిదీ బెస్ట్ ఉండాల్సిందేననే రేంజ్ లో చిరంజీవి అన్నీ దగ్గరుండి పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది.
ఇన్ని చూసుకుంటూ ఇంకోవైపు నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్లలో పాల్గొనాలి. ఆల్రెడీ బుచ్చిబాబు ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. తుదరం ఫేమ్ తరుణ్ మూర్తి ఇటీవలే చిరుని కలిశారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. శ్రీకాంత్ ఓదెలది ఇప్పట్లో మొదలయ్యే సూచనలు లేకపోవడంతో హఠాత్తుగా కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కాకా, మెగావర్స్, విశ్వంభర ఇలా ఎక్కడ చిరంజీవిని చూసినా ఒకే ఎనర్జీతో ఉంటున్నారని దగ్గరి నుంచి చూసినవాళ్ల కామెంట్.
This post was last modified on November 4, 2026 10:21 pm
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…
ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…
మావిగన్.. (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలతో కూడిన రాజధాని) జగన్ చేసిన ఈ ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందే!. దీనినే తమ…
ఇటీవలే అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విద్యార్థినిపై మెషీన్ రంపంతో దాడి జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.…