వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ల కోసం ఏర్పడుతున్న డిమాండ్ గమనిస్తే ట్రేడ్ వర్గాలకు నోట మాట రావడం లేదు. హైదరాబాద్ పీసీఎక్స్ లో స్పెషల్ ఫ్యాన్ షోకు అఫీషియల్ పాప్ కార్న్ బకెట్ తో కలిపి ఒక్కో టికెట్ రెండు వేల రూపాయలకు పైగా పెడుతున్నా అందరికీ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అల్లు డాల్బీ సినిమా టికెట్ల కోసం ఏకంగా బడా నేతల రికమండేషన్లు వస్తున్నాయట.
మన దగ్గరే ఇలా ఉంటే ఇక టికెట్ ధరలకు ఎలాంటి క్యాపింగ్ ఉందని ముంబై లాంటి నగరాల్లో సిచువేషన్ ఊహించుకోవచ్చు. ప్రీమియర్ ఐమాక్స్ స్క్రీన్ లో గరిష్టంగా ఒక టికెట్ మూడున్నర వేల రూపాయలున్నా దొరకడం అంత ఈజీగా లేదు. రిలీజ్ కు పాతిక రోజుల ముందే ఇంత ఫీవర్ ఉండటం ఎవరూ ఊహించలేదు. ఏడేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో యూత్, చిన్నపిల్లలు ఫస్ట్ డే చూడకపోతే ఏదో అయిపోతుందనే రేంజ్ లో జ్వరం పెంచేసుకుని టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో అవెంజర్స్ డూమ్స్ డే సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి పోటీగా వస్తున్న డ్యూన్ పార్ట్ 3 కూడా నేనేం తక్కువా అనే రీతిలో అమ్మకాలు చేసుకుంటోంది. పోలిక పరంగా చూసుకుంటే ఎవరిది పై చేయో చెప్పనక్కర్లేదు. డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న దాని ప్రకారం ఈ యూఫోరియా కేవలం సిటీస్ కే పరిమితం కాదని, కింది స్థాయి సెంటర్లలో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు చూడబోతున్నామని జోశ్యం చెబుతున్నారు.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అవెంజర్స్ డూమ్స్ డే చేయబోయే వసూళ్ల విధ్వంసానికి బాక్సాఫీస్ సాక్షిగా నిలుస్తుంది. తెలుగు డబ్బింగ్ కు పెద్ద డిమాండ్ వచ్చేలా ఉంది. బాలీవుడ్ మీడియా వర్గాల కథనం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ రూపంలో సుమారు యాభై అయిదు కోట్లకు పైగానే వసూలు చేసిందట. తొమ్మిది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయాయని అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గరికొచ్చే కొద్దీ ఇంకేం చేస్తుందో ఊహించుకోవడం కష్టమే..
This post was last modified on November 24, 2026 11:15 pm
బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…
కీడా కోలా నుంచి ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నటుడిగా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఇటీవలే…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. కవిత…
మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ ఒక టాక్ షోలో చూశాం. మా టీవీ కోసం ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు…
రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి తన స్థాయికి ఏమాత్రం తగని పేలవమైన సినిమాలు తీస్తున్నా.. కొన్ని ఇంటర్వ్యూలో దారుణమైన…
ఏపీ మాజీ సీఎం జగన్ కు కృష్ణా జలాలు అప్పణంగా ఆంధ్రాకు తరలించేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని…