Political News

పిఠాపురంలో `ఫ‌స్ట్ డే` ర‌చ్చ‌..  ఏం జ‌రిగిందంటే!

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం మునిసిపాలిటీలో ముని సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ల ప్ర‌మాణ స్వీకార‌కార్య‌క్ర‌మం సోమ‌వారం నిర్వ‌హించారు. అయితే.. తొలిరోజే.. ఈ కార్య‌క్రమం ర‌చ్చ‌కు దారితీసింది. ఇది జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు బాహాబాహీకి దిగే వ‌ర‌కు చేరుకుంది. దీంతో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని కొద్ది సేపు వాయిదా వేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌రిస్థితిలో మార్పు రాక‌పోవ‌డంతో అధికారులు అక్క‌డ నుంచి వెళ్లిపోయారు.

ఏం జ‌రిగింది?

పిఠాపురం మునిసిపల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు రెండింటిని కూడా కూట‌మి మిత్ర‌ప‌క్షంగా జ‌న‌సేన ద‌క్కించుకుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు కూడా పూర్త‌యింది. ఎవ‌రు చైర్మ‌న్ పోస్టుకు ఎంపిక కావాలి…?  ఎవ‌రు వైస్ చైర్మ‌న్ పోస్టును తీసుకోవాలి..? అనే విష‌యాల‌పై స్ప‌ష్టంగా పార్టీ అధిష్టానం స్థానిక నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోతుంద‌ని ప్ర‌మాణ స్వీకారం.. తేలిక‌గానే సాగుతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఈ ప‌ద‌వుల విష‌యంలోనే ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో ర‌చ్చ‌కు దారితీసింది. ముఖ్యంగా వైస్ చైర్మ‌న్ విష‌యంలో పార్టీ అధిష్టానం నిర్ణ‌యించిన అభ్య‌ర్థికి కాకుండా.. స్థానికంగా కొంద‌రు నాయ‌కులు ఎంపిక చేసిన అభ్య‌ర్థికి జ‌న‌సేన కౌన్సిల‌ర్లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాలే ధిక్క‌రిస్తారా? అంటూ.. జ‌న‌సేన‌లో రెండు వ‌ర్గాలుగా చీలిపోయి.. వివాదానికి దిగారు. ఈ క్ర‌మంలో  ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ .. పీఎ జోక్యం చేసుకుని స‌ర్దిచెప్పే ప్ర‌యత్నం చేయ‌గా.. ఆయ‌న పై కొంద‌రు చేయి చేసుకున్నారు.

ఎవ‌రికి ఏ ప‌ద‌వి?

పార్టీ అధిష్టానం పిఠాపురం మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని బొజ్జ వెంక‌టేశ్వ‌ర‌రావును ఎంపిక చేసింది. పార్టీ కోసం గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డ్డార‌ని, క్షేత్ర‌స్థాయి నుంచి పార్టీలో ఉన్నార‌ని పేర్కొంది. దీనిపై ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని కూడా కొన్నాళ్ల కింద‌ట తేల్చిచెప్పింది. అయితే.. దీనిని వ్య‌తిరేకించిన కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు.. బొజ్జ వెంక‌టేశ్వ‌రావు.. 2024 త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చార‌ని.. ఈ విష‌యంలో అధిష్టానాన్ని కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. అందుకే.. పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన సంధ్య‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.

ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌కు దారితీయ‌డం, జ‌న‌సేన‌కు ఉన్న 36 మంది కౌన్సిల‌ర్ల‌లో చీలిక వ‌చ్చి.. 20 మంది ఒక వ‌ర్గంగా.. బొజ్జ‌కు సానుకూలంగా ఉంటే, మ‌రో 16 మంది సంధ్య‌కు అనుకూలంగా మారి నినాదాలు చేశారు. ఈ నేప‌థ్యంలో అధికారులు తొలుత ప్ర‌మాణ‌స్వీకారాన్ని వాయిదా వేశారు. త‌ర్వాత కూడా ప‌రిస్థితి స‌ర్దుమ‌ణ‌గ‌క పోవ‌డంతో అధికారులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారాన్ని పార్టీ అధిష్టానానికి చేర‌వేశారు. పార్టీ తీసుకునే నిర్ణ‌యం మేర‌కు త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు.

This post was last modified on November 24, 2026 11:55 pm

Share

Recent Posts

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

9 minutes ago

టీడీపీ జెండాను తొక్కిన వైసీపీ కార్యకర్తలు.. కరెక్టుగా డీల్ చేసిన గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.  ఎన్నికల ప్రచారంలో  జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…

17 minutes ago

కోర్టుకెక్కుతున్న ‘హనుమాన్’ పంచాయితీ?

2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…

27 minutes ago

క‌లెక్ట‌ర్‌ తోనే పెట్టుకున్న ఎమ్మెల్యే… తమిళనాట రచ్చ రచ్చ!

``నువ్వు కొంచెం గ్లామ‌ర్‌గా ఉండాలి. పంజాబీ డ్ర‌స్.. నీకు బాగుంటుంది. చీర‌ల సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…

31 minutes ago

అవెంజర్స్ అంటే ఇంత పిచ్చి ఉందా

వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…

51 minutes ago

దాదా ముందూ వెనకా ఎన్నో సవాళ్లు

బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…

1 hour ago