జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఎదురొచ్చారు. జ‌గ‌న్ త‌న కారులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న‌స‌మ‌యంలో ద‌స్త‌గిరి కారు కూడా అదే దారిలో ముందు వ‌చ్చింది. దీంతో ద‌స్త‌గిరి కారు దిగి.. జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ ప‌రిణామం తో వైసీపీ నాయ‌కులు హ‌తాశుల‌య్యారు.

వ‌స్తూ వ‌స్తూనే ద‌స్తగిరి.. మా జీవితాల‌ను నాశ‌నం చేశావ్‌! అంటూ.. జ‌గ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. పోలీసు లు అడ్డుకుని ద‌స్త‌గిరిని జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా నిలువ‌రించారు. కొద్దిసేపు ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం.. చోటు చేసుకుంది. అయితే, పోలీసులు గ‌ట్టిగా హెచ్చ‌రించ‌డంతో ద‌స్త‌గిరి కారెక్కి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌పై ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ వ‌ల్లే త‌మ జీవితాలు నాశ‌నం అయ్యాయ‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ఎక్క‌డ‌కు వ‌చ్చినా ప్ర‌శ్నించి తీరుతాన‌ని చెప్పారు.

జ‌గ‌న్ వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌శాంత‌తా లేద‌న్నారు. జ‌గ‌న్‌ను ఈ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌నిగా అభివ‌ర్ణించారు. “సొంత బాబాయ్ వివేకాను చంపించి.. మా జీవితాలు నాశనం చేశావ్” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టార‌ని ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తే త‌ప్పేంట‌ని అన్నారు. త‌న వాహ‌నంపై వైసీపీ కార్య‌కర్త‌లు దాడులు చేశార‌ని పేర్కొన్నారు. దీనిపై తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. అనంత‌రం.. ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న‌ట్టు చెప్పారు.