బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు కనిపిస్తోంది. యలహంక ప్యాలెస్ లో షర్మిల కూతురు అంజిలి పెళ్లి చేయడానికి వీల్లేదని జగన్ కరాఖండిగా చెప్పడంతో ఆ పెళ్లి వేదికను షర్మిల మార్చారు. అయితే, ఆ ప్యాలెస్ లోకి షర్మిల రాకూడదంటూ జగన్ కోర్టుకెక్కినట్లు వైనం షాకింగ్ గా మారింది.
తన కుమార్తె అంజిలి పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల రేపు ఆదివారం నాడు యలహంక ప్యాలెస్ కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే, షర్మిలను అడ్డుకునేందుకు జగన్ కోర్టును ఆశ్రయించారు. షర్మిల ప్యాలెస్ లోకి రాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దేవనహళ్లి కోర్టులో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో జగన్ తరఫున పిటిషన్ దాఖలైంది. దీంతో, కోర్టు ఏం తీర్పునిస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
యలహంక ప్యాలెస్ భారతి రెడ్డి కుటుంబానికి చెందినదని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, యలహంక ప్యాలెస్ షర్మిలదేనని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ ప్యాలెస్ లో షర్మిలకూ ఇల్లు ఉందని, కానీ, ఒకటే కాంపౌండ్ కాబట్టి భద్రతా కారణాల రీత్యా ఇక్కడ పెళ్లి వద్దని జగన్ చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇప్పుడు, ఏకంగా ఆ ఇంట్లో షర్మిలకు హక్కు లేదని, అసలు ఆ ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్లు వేశారు. మరి, ఈ వ్యవహారంపై షర్మిల తాజా స్పందన ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates