మూడు పార్టీలు..ముగ్గురు అధ్యక్షులు…మూడు రకాల రాజకీయ వైరుధ్యం ఉన్న నేతలు, కార్యకర్తలు…ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేల కలయికలో ఏర్పడిన కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. అయితే, లోకల్ వార్ లో జయం వెనుక మూడు పార్టీల అధినేతలు ఎంతో కసరత్తు చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు చేయడం, పొత్తు ధర్మం కోసం కొన్ని చోట్ల రెబల్స్ పోటీకి నిలబడడం వంటి పరిణామాలు జరిగాయి. ఇక, తాజాగా జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వంటి సీనియర్ నేతలు అలక పాన్పు ఎక్కారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎంతో శ్రమించి కూటమి ధర్మం పాటిస్తూ జడ్పీటీసీ స్థానాలను ఫైనల్ చేసినా తమ వాళ్లు అడగడం కరెక్ట్ కాదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తన పార్టీలో కూడా ఇంత ఎక్సర్ సైజ్ చేసినా ముగ్గురు అలిగి కూర్చున్నారని, బాధ్యత లేకుండా అలగడం ఏంటని ప్రశ్నించారు.
తాను ఎంతో కసరత్తు చేసి జిల్లా పరిషత్ లన్నీ డిసైడ్ చేశానని, కూటమి ధర్మాన్ని పాటించాలని తాను చేస్తే అక్కడ కొంతమందికి సీటు రాలేదని వాళ్లు అలగడం ఏంటని పరోక్షంగా ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐ యామ్ నాట్ హ్యాపీ అంటూ బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తపరిచారు. అయితే కౌన్సిలింగ్ చేయడం కండెమ్న్ చేయడం… తప్ప తానేమీ చేయలేనని తేల్చి చెప్పారు చంద్రబాబు.
కాగా, కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపు వ్యవహారంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించాలని, తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డికి ఆ అవకాశం ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కోరారు. అయితే, ఆ పదవి టీడీపీకి చెందిన పుత్తా నరసింహారెడ్డికి కేటాయించడంతో ఆదినారాయణ రెడ్డి మనస్తాపం చెందారు. అంతేకాదు, ఆయన రాజీనామా కూడా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates