జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి.. ఒమర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు. గత ఆరేళ్లకు పైగా ఆయన ఓ మహిళా జర్నలిస్టును ప్రేమిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెతోనే ఆయన వివాహం జరగడం గమనార్హం. వివాహాన్ని అత్యంత రహస్యంగా కొద్ది మంది ప్రముఖుల సమక్షంలోనే చేసుకున్నట్టు ఒమర్ ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒమర్.. అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, 2009 జనవరి 5 నుండి 2015 జనవరి 8 వరకు జమ్మూ కాశ్మీరు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రి గా ఉన్నారు.
ఎవరా జర్నలిస్టు?
ఏకంగా ముఖ్యమంత్రితోనే లవ్ కొనసాగించి.. వివాహం కూడా చేసుకున్న జర్నలిస్టు ఎవరు అంటూ.. నెటిజన్లు చాలా ఆసక్తిగా శోధించారు. ఆమె పేరు నిధి రజ్దాన్.. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎన్డీటీవీ 24×7 న్యూస్ డిబేట్ షో లెఫ్ట్, రైట్ , సెంటర్, వీక్లీ డిబేట్ షో, ది బిగ్ ఫైట్ యాంకర్‌గా గుర్తింపు పొందారు. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్‌తో ఏర్పడిన పరిచయం.. తర్వాత కాలంలో ప్రేమగా మారింది. ఆ తర్వాతే.. ఇరువురు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఒమర్‌కు ఇది రెండో వివాహం. ఆయనకు గతంలోనే పాయల్ అనే మహిళతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నాలుగేళ్ల వెయిటింగ్.. వెనుక
సీఎం ఒమర్, ఆయన ప్రేమికురాలు, జర్నలిస్టు నిధి.. నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయడానికి కారణం.. ఒమర్ భార్య పాయల్ విడాకులకు ఒప్పుకోకపోవడమే. అయితే.. ఇరువురు విడిపోయి నాలుగేళ్లు కావడం.. విడివిడిగానే జీవిస్తున్నట్టు ఒమర్ సాక్ష్యాలను ఇవ్వడంతో ఇటీవలే సుప్రీంకోర్టు ఆయనకు విడాకులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతోనే ఒమర్ తాజాగా నిధిని వివాహం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన వివాహానికి కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం లేకుండానే తంతును ముగించారు.
ఆమెకు కూడా..
ఇక, సీఎం ఒమర్‌ను వివాహం చేసుకున్న నిధికి కూడా ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. గతంలో ఆమె నీలేశ్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. అయితే.. వీరి వివాహ బంధం కేవలం రెండేళ్లే కొనసాగింది. ఆతర్వాత.. ఆమె 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత.. నుంచి ఎన్డీటీవీ యాంకర్‌గా గుర్తింపు పొందారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates