జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరింత వేగం

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను రోజువారీగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఆయా కేసుల విచార‌ణ‌లో క‌ద‌లిక ప్రారంభ‌మైంది. ఒకే రోజు శ‌నివారం 8 డిశ్చార్జి పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ జ‌ర‌ప‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా కేసుల‌కు సంబంధించి 45 డిశ్చార్జి పిటిష‌న్ల‌పై విచార‌ణ పూర్త‌యింది. వీటిపై తీర్పులు సోమ‌వారం లేదా మంగ‌ళ‌వారం నాటికి వెలువ‌డే అవ‌కాశం ఉంటుంది. అనంత‌రం.. కేసుల విచార‌ణ మ‌రింత పుంజుకుంటుంద‌ని సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

అస‌లేంటీ కేసులు?

వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి హ‌యాంలో 2006-07 మ‌ధ్య ప‌లువురు వ్యాపార వేత్త‌లు, ప్ర‌ముఖులు.. జ‌గ‌న్ స్థాపించిన కొన్ని కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టారు. అయితే.. వీటికి ముందు వారికి ప్ర‌భుత్వ ప‌రంగా భారీ ల‌బ్ది చేకూర్చార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టార‌న్న‌ది కేసు. త‌ద్వారా.. క్విడ్ ప్రోకో జ‌రిగింద‌ని సీబీఐ ఆరోపించింది. ఇలా.. ప‌లు సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల వ‌ర్షం కురిసింద‌ని పేర్కొంది. సాక్షి మీడియాలో కూడా పెట్టుబడులు ఇలానే వ‌చ్చాయ‌నితెలిపింది. ఈ కేసు ద‌ర్యాప్తు పూర్త‌యినా.. ఇంకా విచార‌ణ ద‌శ‌కు రాలేదు. కానీ, ఆస్తుల‌ను మాత్రం ఫ్రీజ్ చేయ‌గా.. ఆత‌ర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన జ‌గ‌న్‌.. ఆస్తుల వినియోగానికి అనుమ‌తులు తెచ్చుకున్నారు.

ఇక‌, ఇత‌ర సంస్థ‌ల విష‌యానికి వ‌స్తే.. ఇండియా సిమెంట్‌, భారతీసిమెంట్స్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్త‌లు పెట్టుబ‌డులు పెట్టారు. అదేస‌మ‌యంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం నుంచి అయాచిత ల‌బ్ధిని పొందారు. ఆయా సంస్థ‌ల్లో చాలా వాటిపై చార్జిషీట్లు న‌మోద‌య్యాయి. విచార‌ణ ద‌శ‌ల్లోనూ ఉన్నాయి. అయితే… ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు.. కొన్నాళ్లు జైల్లో కూడా ఉండి వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. వారంతా..త‌మ‌కు ఈ కేసుల‌కుసంబంధం లేద‌ని.. త‌మ‌ను ఈ కేసుల నుంచి విముక్తి చేయాల‌ని కోరుతూ.. డిశ్చార్జి పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీరి విష‌యాన్నే ప్ర‌స్తుతం సీబీఐ, ఈడీ కోర్టులు తేల్చుతున్నాయి.

కొన్నేళ్లుగా ఎటూ తేల‌కుండా ఉన్న‌.. డిశ్చార్జి పిటిష‌న్ల‌పై రోజు వారీ విచార‌ణ‌ను ప్రారంభించారు. విజయసాయిరెడ్డి స‌హా ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, పారిశ్రామిక వేత్త‌ అయోధ్యరామిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, జ‌గ‌న్ స్నేహితుడు, పారిశ్రామిక వేత్త‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ తదితరులు డిశ్చార్జి పిటిష‌న్లు వేయ‌గా.. తాజాగా శ‌నివారం వీటిపై విచార‌ణ వాద‌న‌లు కూడా పూర్త‌య్యాయి. మొత్తంగా 45 పిటిష‌న్ల‌పై వాద‌న‌లు పూర్తికావ‌డంతో కోర్టు తీర్పును రిజ‌ర్వ్ చేసింది. ఈ విష‌యం తేలితే.. అస‌లు పిటిష‌న్ల‌పై వ‌డివ‌డిగా విచార‌ణ జ‌ర‌గ‌నుంది.