చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలకు వైసీపీ అధినేత జగన్ కూడా మద్దతిచ్చారు. ఇక, ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు జ్ఞానేశ్ తెరలేపారని, ప్రధాని మోదీతో కలిసి ఆయన ఈ కుట్రకు పాల్పడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఈసీ ఎంపిక విధానంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈసీని ఎంపిక చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండకూడదని, ప్రస్తుతం ఉన్న విధానం పరోక్షంగా ఒక పార్టీకి చెందిన వారిదే ఆ నియామక అధికారం అన్నట్లు ఉందని జగన్ ఆరోపించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) ఆఫ్ ఇండియాను గతంలో ఎన్నుకునే విధానం మళ్లీ రావాలని జగన్ కోరారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు, సీజేఐ, ప్రధాని…ఇలా ముగ్గురు ఓటింగ్ ద్వారా సీఈసీని ఎంపిక చేసేవారని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడు ప్రధాన మంత్రి…ఆయన ఎంపిక చేసిన ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు..ఇలా ఈ ముగ్గురు కలిసి ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ సీజేఐ లేరని, అప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రి ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు కాబట్టి….పారదర్శకంగా సీఈసీ ఎంపిక జరగదని అన్నారు. ఈ విధానం మారాలని అభిప్రాయపడ్డారు.
అయితే, గతంలో ఇప్పుడున్న ఎంపిక విధానానికి తాము మద్దతిచ్చామని, కానీ, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నామని చెప్పారు. ఇలా ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి సీఈసీని ఎంపిక చేసే విధానినికి మద్దతిచ్చి తప్పు చేశామని జగన్ వాపోయారు. ఎగ్జామినర్ ను పరీక్ష రాసే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోకూడదని, ఆ ఎగ్జామినర్ ఎంత నిజాయితీపరుడైనా సరే పరీక్ష రాసే విద్యార్థి ఎంపిక చేయడం సరైనది కాదని అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి ఫలితాలు అలా వచ్చాయని జగన్ మరోసారి ఈవీఎంలపై, సీఈసీ, ఎస్ఈసీ పనితీరుపై షాకింగ్ ఆరోపణలు చేశారు. అయితే, అలా ఫలితాలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. చాలామంది ప్రజాస్వామ్య వాదులు ఏపీలో జరిగిన అవకతవకలపై ఆధారాలతో సహా కోర్టుకు కూడా వెళ్లారని, కానీ, వ్యవస్థలో మార్పు రావాలని కోరారు. న్యూట్రల్ గా ఎస్ఈసీ, సీఈసీలను ఎంపిక చేయాలని అన్నారు.
This post was last modified on October 18, 2026 11:02 pm
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…
వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆదివారం మధ్యాహ్నం 3…
తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…
తెలంగాణలో దసరా వచ్చిందంటే.. ఎక్కడ చూసినా సందడే సందడి. బతుకమ్మ పాటలు, ఆటలతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వేరే ప్రాంతాల…
తాజాగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠాపై…
బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…