Political News

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని యాక్టివ్ అయ్యారు. అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన ఆయ‌న వారిని గెలిపిం చుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నారు. తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప్ర‌చారంచేస్తున్నారు. ఇది కొన్ని కొన్నివార్డుల్లో ఉద్రిక్త‌త‌ల‌కు కూడా దారితీసింది. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య ర‌చ్చ‌గా మారింది. ఇరు పార్టీల నాయ‌కులు కూడా.. రోడ్డెక్కి ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి కొడాలి నానీకి పార్టీ నుంచి పూర్తిభ‌రోసా ల‌భించిన‌ట్టు మ‌రో ప్ర‌చారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న నాని.. గ‌త రెండు రోజుల నుంచి యాక్టివ్‌కావ‌డానికి ఇదే కార ణ‌మ‌ని తెలుస్తోంది. పార్టీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు గ‌త కొన్నాళ్లుగా సస్పెన్స్ కొన‌సాగింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇదే త‌న చివ‌రి ఎన్నిక‌ల‌ని కొడాలి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత‌.. అనారోగ్య స‌మ స్య‌ల‌తో ఆయ‌న ఆసుప‌త్రిలోనే ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌తో బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నించార‌ని.. సినీరంగానికి చెందిన ఓ నిర్మాత‌ను ఆయ‌న లైన్‌లో కూడా పెట్టార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌తో కొడాలి మ‌రింత సైలెంట్ అయ్యారు. ఆ త‌ర్వాత‌.. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ముందుకు సాగ‌క‌పోవ‌డం.. స‌ద‌రు నిర్మాత వెన‌క్కిత‌గ్గ‌డంతో కొడాలికి లైన్ క్లియ‌ర్ చేశార‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి కొడాలికే ఈ టికెట్ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా జ‌రుగుతు న్న స్థానిక ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటుకునేందుకు నాని ప్ర‌య‌త్నిస్తున్నారు.

టీడీపీ విశ్వ ప్ర‌య‌త్నం..

గుడివాడ‌పై సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ప‌సుపు జెండా ఎగ‌రేసిన టీడీపీ, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌న హ‌వా చాటుకునేందుకు ప్ర‌తిష్టాత్మ‌కంగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రామును మ‌రింత‌యాక్టివ్ చేయ‌డంతోపాటు.. పార్టీ త‌ర‌ఫున సీనియ‌ర్లు కూడా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఇక‌, రాము కూడా.. ఇప్పుడు త‌న హ‌వాను నిల‌బెట్టుకుని తీరాల్సిన ప‌రిస్థితిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. గుడివాడ‌లో కొడాలి యాక్టివ్ కావ‌డం.. టీడీపీ వ్యూహాలు మ‌రింత మెరుగుపెట్టుకోవ‌డంతో ప్ర‌స్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది.

This post was last modified on November 28, 2026 11:22 am

Share

Recent Posts

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

6 minutes ago

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

22 minutes ago

అమరావతిపై విషం కక్కుతోన్న వైసీపీ

రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విషం కక్కుతోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు…

39 minutes ago

ఆ రోజు చిరు బీర్ తాగి ఉంటే..?

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కొన్ని వీడియోలు అవీ పోస్ట్ చేస్తూ.. ఒక టెంప్లేట్ కామెంట్ పెడుతుంటారు.…

2 hours ago

5 నెలలు ఆలస్యంగా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రెండు సంచలన విషయాలను వెల్లడించారు. ఒకటి... జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని తేల్చి చెప్పేశారు. రెండు...జమిలీ…

3 hours ago

ఇలా చేస్తే ఇక కాపీలు కొట్టలేరు

పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు చైనా సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరీక్ష…

10 hours ago