Movie News

ఇడుపు కాయితం… ఆంధ్రాలో కొంచం డౌట్?

ఈ మధ్య తెలుగులో ఒక ప్రాంతానికి సంబంధించిన రూటెడ్ కథలు తరచుగా వస్తుండగా, వాటికి ఆయా ప్రాంతాల్లోనే ఆదరణ దక్కుతుండడం.. మిగతా ఏరియాల్లో స్పందన అంతంత మాత్రమే ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణ నేపథ్యంలో నడిచే ప్యారడైజ్ సినిమా ఈ ప్రాంతంలో బాగా ఆడగా, ఏపీలో ఆశించిన ఫలితం అందుకోలేదు. అలాగే ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే గరివిడి లక్ష్మి ఆ ఏరియాలో మంచి ఫలితాన్ని అందుకోగా, మిగతా ప్రాంతాల్లో సరైన రిజల్ట్ అందుకోలేదు.

అలాగే డిసెంబర్ 11న విడుదల కాబోతున్న ఇడుపు కాయితం చిత్రానికి తెలంగాణలో మంచి బజ్ కనిపిస్తోంది. ఏపీలో మాత్రం ఈ చిత్రానికి సినిమాకు హైప్ క్రియేట్ అవ్వలేదు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాస్ కూడా అంగీకరించాడు.

తాజాగా ఇడుపు కాయితం చిత్రం నుంచి కొత్త పాట లాంచ్ చేసిన సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ.. తనకున్న సమాచారం మేరకు ఇడుపు కాయితం గురించి తెలంగాణ జనాలకు బాగా తెలుసని.. ఇక్కడ మంచి బజ్ క్రియేట్ అయిందని తెలిపాడు. కానీ ఆంధ్రలో మాత్రం ఈ సినిమా గురించి పెద్దగా చర్చ లేదని, అక్కడ హైప్ పెరగాల్సి ఉందని బన్నీ వాస్ అన్నాడు. తమ సినిమాకు తెలంగాణలో మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశించిన బన్నీ వాస్.. ఆంధ్ర విషయంలో మాత్రం కొంత సందేహం వ్యక్తం చేశాడు.

అయితే ఏపీలో తొలి రోజు సినిమా కొంచెం స్లోగా ఉన్నా సరే.. తర్వాత కంటెంట్ వల్ల బలంగా పుంజుకుంటుందని బన్నీ వాస్ ధీమా వ్యక్తం చేశాడు. అందుకు కారణం కథ మీద ఉన్న నమ్మకమేనని అన్నాడు. సుకుమార్ సతీమణి తబిత తో కలిసి బన్నీ వాస్ నిర్మించిన ఇడుపు కాగితం మూవీలో ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటించారు. వంశీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

This post was last modified on November 28, 2026 1:56 pm

Share

Recent Posts

టోల్ ప్లాజా దగ్గర ఐఏఎస్ రచ్చ

మన దేశంలో టోల్ ప్లాజాల దగ్గర ప్రోటోకాల్ పంచాయతీలకు కొదవే లేదు. కొందరు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు..ఇలా నిర్దేశించిన కొంతమంది…

28 minutes ago

పిలవని పేరంటానికి వస్తే పోలీస్ కేసు

పెళ్లిళ్లకు ఆహ్వానం లేకుండానే వెళ్లి విందు భోజనాలు చేసే వారికి తెలంగాణలోని వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం గట్టి…

2 hours ago

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

4 hours ago

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి…

4 hours ago

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్…

4 hours ago

అమరావతిపై విషం కక్కుతోన్న వైసీపీ

రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విషం కక్కుతోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు…

4 hours ago