అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిడివి దాదాపు అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు పాటిస్తున్నవే. రికవరీ వేగంగా ఉండాలనే ఉద్దేశంతో నెల రోజుల గ్యాప్ తక్కువే అయినా నిర్మాతలకు ఓకే చెప్పడం మినహా వేరే దారి కనిపించడం లేదు. ఇరుముడి లాంటి జనరేషనల్ బ్లాక్ బస్టర్ సైతం త్వరగా డిజిటిల్ లో రావడం థియేటర్ రన్ మీద ప్రభావం చూపించింది.
ఇక అసలు విషయానికి వస్తే ప్యారడైజ్ కోసం సోషల్ మీడియా వర్గాలు కొన్ని కాచుకుని ఉన్నాయి. కారణం తెలిసిందే. నానిని మరింత దగ్గరగా శల్య పరీక్ష చేయడంతో పాటు ట్రోలింగ్ రూపంలో మంచి రీచ్ తెచ్చుకోవడం. ఇటీవలే ధూమవతి వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే దాని క్లిప్పులు తీసుకొచ్చి నెగటివిటీని చేసిన వాళ్ళు చాలానే ఉన్నారు. పబ్లిసిటీ విషయంలో టీమ్ రెండో వారంలోనే సైలెంట్ అయిపోవడంతో ఇలాంటివి పట్టించుకునే ఓపిక ఎవరికీ లేకపోయింది.
ఇదిలా ఉంచితే ప్యారడైజ్ వల్ల నాని నేర్చుకున్న పాఠాలు చాలానే ఉన్నాయి. సరైన కథా కథనాలు లేకపోతే ఓవర్ మాస్ తన మీద ఎంత నెగటివ్ అవుతుందో ప్రత్యక్షంగా అర్థమైపోయింది. నైజామ్ వల్ల కలెక్షన్లు బాగొచ్చాయి కానీ మిగిలిన ఏరియాల్లో, ఓవర్సీస్ లో నష్టాలు రావడం ఊహించని షాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని గుడ్డిగా నమ్మడం మంచిదే అయినా స్క్రిప్ట్ విషయంలో మరింత వడబోత, జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకాస్త మెరుగైన అవుట్ ఫుట్ వచ్చేది.
థియేటర్లో ప్యారడైజ్ మిస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇలాంటి సినిమాలకు ఒక్కోసారి గ్లోబల్ రీచ్ బాగుంటుంది. అందులోనూ వయొలెన్స్, ఇంటెన్స్ డ్రామా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్లకు కనెక్ట్ అయితే మిలియన్ల వ్యూస్ వచ్చి పడతాయి. వాళ్ళ సపోర్ట్ దొరికితే మటుకు ఓటిటిలో హిట్ అయ్యే ఛాన్స్ కొట్టి పారేయలేం. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ప్యారడైజ్ లో కయదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ ప్రధాన తారాగణం.
This post was last modified on October 18, 2026 2:38 pm
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…
వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆదివారం మధ్యాహ్నం 3…
తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…
తెలంగాణలో దసరా వచ్చిందంటే.. ఎక్కడ చూసినా సందడే సందడి. బతుకమ్మ పాటలు, ఆటలతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వేరే ప్రాంతాల…
తాజాగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠాపై…
బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…