Movie News

బాబీ ఇంత పట్టుదలగా ఎందుకున్నట్టు

దర్శకుడు బాబీ కొల్లి పట్టువదలని విక్రమార్కుడిగా మారిపోయారు. కాకాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకుని, చిరంజీవి ఒక పక్క మెగావర్స్ షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన డేట్లు ఏ మాత్రం వృథా చేయకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఒకవైపు విశ్వంభర పండక్కు రిలీజ్ అవుతుందని పదే పదే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో కాకా జనవరి 13 విడుదలని కన్ఫర్మ్ చేస్తూ అభిమానులకు క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడో డౌట్ రావడం సహజం.

ఎందుకు బాబీ ఇంత పట్టుదలగా ఉన్నాడని ఎందరో మనసులో సందేహం ఉంది. దానికి కారణం లేకపోలేదు. చిరుతో తన మొదటి మూవీ వాల్తేరు వీరయ్య ఎంత బ్లాక్ బస్టరో చెప్పనవసరం లేదు. మెగాస్టార్ కంబ్యాక్ తర్వాత అది పెద్ద గ్రాసర్ గా నిలిచింది. అందుకే ఇంకో అవకాశం దక్కింది. బాబీ మరో సినిమా బాలయ్య డాకు మహారాజ్ కూడా సంక్రాంతికే వచ్చింది. కానీ అనిల్ రావిపూడి వల్ల సంక్రాంతికి వస్తున్నాం రూపంలో రెవిన్యూకి డెంట్ పడింది. లేదంటే ఇంకా భారీ వసూళ్లు వచ్చేవి.

ఈసారి మళ్ళీ అనిల్ రావిపూడితోనే ఢీ కొని తన సత్తా చాటాలనే సంకల్పం బాబీలో ఉండొచ్చు. దానికి చిరు తోడయ్యారు కాబట్టి టార్గెట్ పెట్టుకొవచ్చు. జనవరి 12 విడుదల పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న కమర్షియల్ కంటెంట్ కాగా కాకా మటుకు ఊర మాస్ ఎలిమెంట్స్ తో  పాటు గతంలో చూడని చిరు మూడు షేడ్స్ ని బాబీ ఇందులో ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడని టాక్ ఉంది. అదే నిజమైన పక్షంలో థియేటర్లు ఊగిపోతాయి. ప్రీ రిలీజ్ టాక్ అయితే పాజిటివ్ గా ఉంది.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. వెంకటేష్ – నాగచైతన్య కలయికలో బాబీ తీసిన వెంకీ మామ డిసెంబర్లో రిలీజై ఎబోవ్ యావరేజ్ అయ్యింది. సరైన టైంలో వచ్చి ఉంటే ఇంకా పెద్ద విజయం అందుకునేదని బాబీ నమ్మారట. అందుకే గత కొన్నేళ్లుగా అనిల్ రావిపూడి లాగే తన సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండాలనే లక్ష్యంతో దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం విశ్వంభర అయితే తప్పుకుంది. కానీ యువి క్రియేషన్స్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు.  

This post was last modified on November 28, 2026 11:38 am

Share

Recent Posts

దాదా రెండో ఆప్షన్ వైపు చూస్తున్నాడా

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 24 విడుదల కావాల్సిన దాదా ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తుందనేది…

19 minutes ago

కొడాలి యాక్టివ్ అయ్యారు.. వైసీపీ గ్రీన్‌సిగ్న‌ల్‌.. !

గుడివాడ మునిసిప‌ల్ ఎన్నిక‌లు ఈ నెల 26న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్…

52 minutes ago

అమరావతిపై విషం కక్కుతోన్న వైసీపీ

రాష్ట్రానికి తలమానికంగా నిర్మాణం జరుపుకుంటున్న అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విషం కక్కుతోందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు…

53 minutes ago

ఆ రోజు చిరు బీర్ తాగి ఉంటే..?

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కొన్ని వీడియోలు అవీ పోస్ట్ చేస్తూ.. ఒక టెంప్లేట్ కామెంట్ పెడుతుంటారు.…

2 hours ago

5 నెలలు ఆలస్యంగా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రెండు సంచలన విషయాలను వెల్లడించారు. ఒకటి... జమిలీ ఎన్నికలు జరగడం ఖాయమని తేల్చి చెప్పేశారు. రెండు...జమిలీ…

3 hours ago

ఇలా చేస్తే ఇక కాపీలు కొట్టలేరు

పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు చైనా సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరీక్ష…

11 hours ago