Political News

అయ్య‌న్న ఇలాకాలో తోడికోడ‌ళ్ల ఫైటింగ్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుటుంబానికి మ‌రో కీల‌క ప‌ద‌వి చిక్కింది. ఇప్ప‌టికే చింత‌కాయ‌ల కుటుంబంలో అయ్య‌న్న న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యేగా, స్పీక‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఆయ‌న కుమారుడు విజ‌య్ పాత్రుడు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఇటీవ‌లే ఎంపిక‌య్యారు. ఇక‌, తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో కీల‌క ప‌ద‌విని చింత‌కాయ‌ల అయ్య న్న‌పాత్రుడి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తికి చంద్ర‌బాబు క‌ట్టెబ‌ట్టారు. తాజాగా విడుద‌ల చేసిన రెండో జాబితాలో న‌ర్సీప‌ట్నం మునిసిప‌ల్ చైర్మ‌న్ పోస్టును ఆమెకు కేటాయించారు. దీంతో చింత‌కాయ‌ల ఫ్యామిలీకి మూడు ప‌ద‌వులు ద‌క్కిన‌ట్టు అయింది.

తోడికోడ‌ళ్ల మ‌ధ్య కుమ్ములాట‌!

తాజాగా ప్ర‌క‌టించిన న‌ర్సీప‌ట్నం టీడీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని చింత‌కాయ‌ల కుటుంబానికి చెందిన బీసీ మ‌హిళ‌కు ఇచ్చారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి ప‌ద్మావ‌తిని తాజాగా కూటమి తరపున ఎంపిక చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఆమె శుక్ర‌వారం మంచిరోజ‌ని భావించి.. నామినేష‌న్ వేసేశారు. ఇక‌, శ‌నివారం ఆమెకు పార్టీ అధిష్టానం ఆశీస్సులు అందించింది. అధికారిక అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. దీంతో ఆమెకే కూట‌మి శ్రేణులు క‌లిసి రానున్నాయి.

అయితే.. ఇదేస్థానం నుంచి ప‌ద్మావ‌తికి వ‌రుస‌కు తోడికోడ‌లు అయ్యే చింతకాయల అనిత వైసీపీ త‌ర‌ఫున నామినేష‌న్ వేశారు. ఈమె అయ్యన్నపాత్రుడు తమ్ముడైన చింతకాయల సన్యాసిపాత్రుడు స‌తీమ‌ణి కావ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈమె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక‌, ఇక్క‌డే మ‌రో చిత్ర‌మైన ఘ‌ట‌న కూడా చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల్లో జ‌న‌సేన ఈ సీటుపై ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. టీడీపీకి కేటాయించ‌డంతో.. జ‌న‌సేన నిరాస ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, జనసేన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య కూడా చైర్మన్ పదవికి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

గెలుపు ఎవ‌రికి?

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. న‌ర్సీప‌ట్నంలో టీడీపీకి సానుకూల సంకేతాలు వున్నాయి. అయితే.. జ‌న‌సేన త‌ర‌ఫున రెబ‌ల్ అభ్య‌ర్థి బ‌రిలో నిల‌వ‌డం..సౌజ‌న్య‌కు మ‌హిళా ఓటు బ్యాంకు కూడా ఉన్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. అయితే.. ఆదివారం వ‌ర‌కు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఆమెను బుజ్జ‌గించ‌నున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, వైసీపీకి కూడా న‌ర్సీప‌ట్నంలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఈ నేప‌థ్యంలో చింత‌కాయ‌ల ఫ్యామిలీకి చెందిన తోడికోడ‌ళ్ల మ‌ధ్యే ఫుల్ ఫైట్ జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.

This post was last modified on October 18, 2026 3:12 pm

Share

Recent Posts

అంబటి కన్ను హోం మంత్రి సీటుపై పడిందా

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి…

2 hours ago

ప్యారడైజ్ కోసం కాచుకుని ఉన్నారు

అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…

3 hours ago

ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో…

5 hours ago

బెజవాడ బరిలో ఏబీవీ ఎవరి ఓట్లు చీల్చుతారు?

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు…

6 hours ago

డైరెక్టర్‌ది నా కులమే… అందుకే కథ చెప్పా

తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ…

6 hours ago

పెద్దిరెడ్డి చేతులెత్తేస్తే జగన్ ఊరుకుంటారా?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న సొంత…

7 hours ago