Political News

బెజవాడ బరిలో ఏబీవీ ఎవరి ఓట్లు చీల్చుతారు?

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు గురై ఆ తర్వాత కోర్టుకు వెళ్లి మరీ తన పదవిని దక్కించుకున్న ఏబీవీ పేరు అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఏబీవీ…ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై కూడా సున్నితంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయా పార్టీలపై విమర్శలతోపాటు ప్రజా సమస్యలపై కూడా ఆయన చురుగ్గా స్పందిస్తున్నారు.

ఈ రకంగా ఏబీవీ ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా విజయవాడ మేయర్ ఎన్నికల బరిలోఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్లు ఏబీవీ ప్రకటించిచ వైనం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, వైసీపీలు ఫాసిస్ట్ శక్తులతో చేతులు కలిపాయని ఏబీవీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక వాద విలువలకు ముప్పు వుాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను అందించే ఉద్దేశ్యంతోనే తాను స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన అన్నారు.

విజయవాడ మేయర్ ఎన్నికల బరిలో జనసేన తరఫున వంగవీటి రాధా, వైసీపీ తరఫున మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆల్రెడీ ప్రచారం మొదలుబెట్టారు. అయితే, ఈ ఇద్దరు బలమైన అభ్యర్థులకు ఏబీవీ ఏ స్థాయిలో పోటీ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థుల ఓట్లతో పాటు ఆయనకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఏపీలో ఆ పార్టీల ప్రభావం అంతగా ఉండకపోయినప్పటికీ ఈ ఇద్దరు అభ్యర్థులకు రాబోయే ఓట్లలో ఏబీవీ ఎంతో కొంత చీల్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆయన రాకతో విజయవాడ మేయర్ ఎన్నిక త్రిముఖ పోరుగా మారింది అని చెప్పవచ్చు.

This post was last modified on October 18, 2026 2:26 pm

Share

Recent Posts

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…

1 hour ago

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3…

3 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

3 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

3 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

4 hours ago

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…

4 hours ago