Political News

నామినేషన్లు వేయనివ్వడం లేదు: జగన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పుంగనూరు, రాయచోటి, పులివెందులతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసిన వైసీపీ కావాలనే ఘర్షణలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వైసీపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని, కానీ, నామినేషన్ కేంద్రాలకు వెళితే వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనియ్యకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఇలా నామినేషన్ వేసే పరిస్థితి లేకపోతే… గవర్నమెంట్ దగ్గరుండి దీన్ని ప్రోత్సహిస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్స్ టెన్డెడ్ గవర్నమెంట్ సంస్థ కింద రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలని చెప్పారు.

నామినేషన్ కేంద్రాల దగ్గర టీడీపీ మూకలు అడ్డుపడుతున్నాయని, పోలీసులు వారికి సహకరిస్తున్నారని, చివరకు అధికారులు కూడా నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇటువంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని వాపోయారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు, గొడ్డళ్లు సప్లై చేసే నాయకుడు చంద్రబాబు హయాంలో మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఈ అధర్మ పాలన జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర రాస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

అయితే, వైసీపీ హయాంలో కూడా టీడీపీ, జనసేన అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా చేసిన విషయాన్ని జగన్ మరిచిపోయినట్లున్నారు. చాలాచోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం వంటివి చేసిన వైనం ప్రజలు మరిచిపోలేదు.

This post was last modified on October 18, 2026 12:42 pm

Share

Recent Posts

ప్యారడైజ్ కోసం కాచుకుని ఉన్నారు

అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…

43 minutes ago

ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో…

2 hours ago

అయ్య‌న్న ఇలాకాలో తోడికోడ‌ళ్ల ఫైటింగ్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుటుంబానికి మ‌రో కీల‌క ప‌ద‌వి చిక్కింది. ఇప్ప‌టికే…

2 hours ago

బెజవాడ బరిలో ఏబీవీ ఎవరి ఓట్లు చీల్చుతారు?

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు…

3 hours ago

డైరెక్టర్‌ది నా కులమే… అందుకే కథ చెప్పా

తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ…

4 hours ago

పెద్దిరెడ్డి చేతులెత్తేస్తే జగన్ ఊరుకుంటారా?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న సొంత…

4 hours ago