ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ముఖ్యమంత్రులు ఒకవైపు, ఉడుకునెత్తురు ఉరకలెత్తే యువత మరోవైపు రణన్నినాదం చేస్తుంటే ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ ను తొలిగించేందుకు ససేమీరా అంటున్నారు. రోజుల తరబడి పోరాటం కొనసాగుతోంది. నెలలు, సంవత్సరాలైనా ఇలాగే పోరాడుతామని రాహుల్ గాంధీ ప్రకటించడంతో ఈ ఉద్యమానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కాన రావట్లేదు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సుత్తి లేకుండా సూటిగా అడిగిన ప్రశ్నలు మంటలు రేపుతున్నాయి.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో జనాభా పెరుగుతుంటే ఓట్ల సంఖ్య ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించడం ప్రజల్లో ఆలోచన రేకేత్తిస్తుంది. ఉజ్జాయింపుగా ఆయన ఈ మాటలు చెప్పలేదు. పక్కా లెక్కల ప్రకారమే మాట్లాడారు. 2014లో 81 కోట్ల ఓట్లు వుంటే 2019లో 91 కోట్ల ఓట్లకు పెరిగాయని తెలిపారు. ఆ తర్వాత 2023లో 97 కోట్లకు పెరిగినట్లు వివరించారు. మోదీ ప్రభుత్వం 13 కోట్ల ఓట్లు తొలగించిందని, ఇప్పుడు దేశ జనాభా ఎంతుందో చెప్పాలని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం దేశాన్ని రెండు రకాలుగా విడగోడుతుందని, తనకు అనుకూలంగా వున్న ఓటర్లు, తనకు వ్యతిరేకంగా వున్న ఓటర్లు గా విభజిస్తుందని చెప్పారు. ఎక్కడ ఓట్లు తొలగిస్తుందో అక్కడ బీజేపీ గెలవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం గురించి ప్రస్థావించారు. మమతా బెనర్జీ ఓడి పోవడం వెనక సర్ కుట్ర వుందని ఆరోపించారు.
దేశం మొత్తం ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తొలిగించాలని కోరుకుంటుంటే ప్రధాన మంత్రి మోదీ ఆయనను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నే కాక్రోచ్ యువకులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మనిషి కోసం లక్షలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి తీసుకొని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ వెంటనే జ్ఞానేష్ కుమార్ ను తొలిగించాలని, సర్ ను రద్దు చేసి దేశ ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates