Political News

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల పిల్లలైతే హిట్ అండ్ స్టే కేసులతో వార్తల్లో నిలుస్తున్నారు. అంటే, యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం రిగ్రెట్ లేకుండా మా నాన్న చూసుకుంటాడులే అన్న ధైర్యంతో వ్యవహరిస్తున్నారు.

తాజాగా కేరళంలో అటువంటి ఘటనే ఒకటి జరిగింది. 19 ఏళ్ల యువకుడు యాక్సిడెంట్ చేసిన తర్వాత…ఏమైనా మా నాన్న చూసుకుంటాడు అంటూ తన మిత్రులతో చెప్పిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కేరళంకు చెందిన 19 ఏళ్ల కొడుకు సుహైల్ సజీవ్ ను కోటీశ్వరుడైన తండ్రి గారాబంగా పెంచాడు. అతి ప్రేమతో కొడుకు బర్త్ డే గిఫ్ట్ కింద కోట్ల ఖరీదు చేసే మినీ కూపర్ కారు కొనిచ్చాడు. అయితే, ఆ కొత్త కారులో ఈ కుర్రకారు పార్టీ చేసుకునేందుకు వెళ్తున్నారు. ఎర్నాకులం జిల్లా కొచ్చి విమానాశ్రయం సమీపంలో అతి వేగంగా దూసుకువెళ్లిన ఆ మినీ కూపర్…ఓ కారు, బైక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కారును నడుపుతున్న 19 ఏళ్ల సుహైల్ ‎ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అంతవేగంగా కారు ఎందుకు నడిపావని సుహైల్‎ను స్థానికులు ప్రశ్నించారు. అయితే, నో ప్రాబ్లమ్.. మా నాన్న అంతా చూసుకుంటాడు అంటూ నిర్లక్ష్యంగా, అహంకారపూరితంగా సమాధానమిచ్చాడు సుహైల్. తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల ముగ్గురు చనిపోయాన్న పశ్చాత్తాపం ఏమాత్రం వ్యక్తం చేయలేదు సుహైల్. ఇక, తాను కేవలం బీరు తాగి డ్రైవ్ చేసినట్లు పోలీసుల ఎదుట సుహైల్ అంగీకరించాడని తెలుస్తోంది.

This post was last modified on October 12, 2026 2:06 pm

Share

Recent Posts

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

21 minutes ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

1 hour ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago

ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం పవన్

2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం…

2 hours ago

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

2 hours ago

డ్యూడ్ హీరో… మోదీనే పొమ్మన్నాడుగా

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…

2 hours ago